UAE weekend days change : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన దేశంగా పేరొందింది. లగ్జరీ లైఫ్‌స్టైల్, వీకెండ్ పార్టీస్‌తో టూరిస్టుల ఫేవరేట్ డెస్టినేషన్‌గా ఉన్న ఈ మెగా సిటీ మరోసారి ప్రత్యేకతను చాటుకొంది. ఇంతవరకూ వారంలో ఐదురోజులే పనిదినాల్ని పాటిస్తూ వస్తోన్న ఈ దేశం.. ఇప్పుడు దానిని నాలుగున్నర రోజులకు మారుస్తున్నట్లు ప్రకటించింది. ఈ జనవరి 1నుంచి ఈ విధానం అమల్లోకి రానున్నట్లు ఆ దేశ అధికారిక మీడియా డబ్ల్యూఏఎం వెల్లడించింది.
జనవరి నుంచి అమలు..
weekend days in dubai: దీనివల్ల ఉత్పాదకత పెరుగుతుందని తెలిపింది. అంతేగాక వ్యక్తిగత, వృత్తిగత జీవితం సమతుల్యం అవుతుందని పేర్కొంది. ప్రపంచ మార్కెట్లతో మరింత అనుసంధానం అయ్యేందుకు ఈ మార్పు దోహదపడుతుందని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నిర్ణయం వచ్చే ఏడాది నుంచి జనవరి అమల్లోకి రానుంది. యూఏఈలో ప్రస్తుతం శుక్ర, శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయి. కానీ 2022 జనవరి 1 నుంచి శుక్రవారం మధ్యాహ్నం నుంచే వీకెండ్ ప్రారంభమవుతుంది.
సౌదీతో పోటీ..
uae weekend days change: పొరుగు దేశమైన సౌదీ అరేబియాతో పోటీ పడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు పలు సంస్కరణలను చేపడుతోంది యూఏఈ. ఈ క్రమంలోనే విదేశీ పెట్టుబడులు, ప్రతిభావంతులైన మానవ వనరులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. "శని, ఆదివారం సెలవుగా పాటించే దేశాలతో ఆర్థిక లావాదేవీలు సజావుగా జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకొన్నాం" అని యూఏఈ ప్రభుత్వం పేర్కొంది.
ఇవీ చదవండి: