ETV Bharat / international

Afghan Crisis: 'అఫ్గాన్‌ వెళితే మమ్మల్ని వారు చంపేస్తారు'

author img

By

Published : Sep 5, 2021, 8:19 AM IST

అమెరికా సాయంతో ఉజ్బెకిస్తాన్‌లో శిక్షణ తీసుకున్న అఫ్గాన్ పైలట్లు తమను తిరిగి స్వదేశానికి పంపుతారేమోనని భయపడిపోతున్నారు. తమను వెనక్కి పంపితే తమను కచ్చితంగా చంపేస్తారని కన్నీరు పెట్టుకున్నారు.

thalibans issue
అఫ్గాన్​లో తాలిబన్లు

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వల్ల విదేశాల్లో ఉన్న అఫ్గాన్లు స్వదేశానికి వెళ్లాలంటే వణికిపోతున్నారు. పౌరులు సహా, అమెరికా సాయంతో ఉజ్బెకిస్తాన్‌లో శిక్షణ తీసుకున్న అఫ్గాన్ పైలట్లు తమను తిరిగి స్వదేశానికి పంపుతారేమోనని భయపడిపోతున్నారు. ఎక్కువ కాలం తమ దేశంలో ఉండడం కుదురదంటూ ఉజ్బెకిస్థాన్ స్పష్టం చేయడంతో వారికి ప్రాణభయం పట్టుకుంది. ఉజ్బెకిస్థాన్ నుంచి తమను వెనక్కి పంపితే తమను కచ్చితంగా చంపేస్తారని ఓ పైలట్ కన్నీరు పెట్టుకున్నాడు. తమను మరికొంత కాలం ఇక్కడే ఉంచాలన్న పైలట్ల విజ్ఞప్తిపై ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం స్పందించలేదు.

అక్కడికి వెళితే చావు తప్పదు..

అఫ్గానిస్థాన్‌లో ప్రజస్వామ్యం ఇక ఉండబోదని తాలిబన్లు వెల్లడించారు. దేశాన్ని ఓ కౌన్సిల్‌ ద్వారా పరిపాలించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే తాలిబన్లు అఫ్గాన్‌ పైలట్లు, సైనికులను కూడా సంప్రదించి వారిని విధుల్లో చేరాలని సూచించినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ప్రభుత్వ, తాలిబన్‌ బలగాలను కలిపి ఓ సైన్యం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. అయితే తమను తాలిబన్లు లక్ష్యంగా చేసుకున్నారని.. అక్కడికి వెళితే తమను చంపేస్తారని అఫ్గాన్‌ పైలట్లు ఆందోళనకు గురవుతున్నారు. ఆంగ్ల వార్తాసంస్థతో ఓ పైలట్‌ మాట్లాడుతూ 'మమ్మల్ని తిరిగి పంపిస్తే.. 100శాతం వారు మమ్మల్ని చంపేస్తారు' అని పేర్కొన్నారు.

ఉజ్బెకిస్థాన్‌లో తలదాచుకున్న అఫ్గాన్‌ పౌరులు, పైలట్లు అక్కడ దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. టెర్మెజ్‌ నగరంలో కరోనా బాధితుల కోసం వేసిన టెంట్లలో అనేక మంది ఆశ్రయం పొందుతూ అరకొర సదుపాయాలతో అల్లాడుతున్నారు. సరైన భోజన సదుపాయాలు లేక పస్తులుంటున్నారు. వైద్య సదుపాయాలు పూర్తిగా అందుబాటులో లేవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:Kabul Women protest: కాబుల్‌లో మహిళల నిరసన ఉద్రిక్తం

Afghan taliban: తాలిబన్​ ప్రభుత్వ ఏర్పాటు మరోమారు వాయిదా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.