ETV Bharat / international

సిరియాపై ఇజ్రాయెల్​ క్షిపణుల వర్షం! - అంతర్జాతీయ సమాజం

దక్షిణ సిరియా ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్​ క్షిపణులతో విధ్వంసం సృష్టించింది. ఈ దాడిలో ప్రాణనష్టమేమీ జరగలేదని సిరియా సైనిక వర్గాలు తెలిపాయి.

Syrian Army says Israel attacked targets in Southern Syria
దక్షిణ సిరియాలో ఇజ్రాయెల్​ బాంబుల వర్షం
author img

By

Published : Feb 4, 2021, 8:03 AM IST

దక్షిణ సిరియాలో ఇజ్రాయెల్​ వాయుసేన క్షిపణుల వర్షం కురిపించిందని సిరియా సైన్యం తెలిపింది. క్వినెట్రా ప్రాంతంలో జరిపిన ఈ దాడుల్లో​ప్రాణనష్టమేమీ జరగలేదని వెల్లడించింది.

స్థానిక కాలమాన ప్రకారం.. బుధవారం రాత్రి 10.42గంటలకు దాడి జరిగిందని సిరియా ప్రభుత్వ​ వార్తా సంస్థ 'సనా' పేర్కొంది. గోలన్​ హైట్స్ క్షిపణి కేంద్రం నుంచి ఈ రాకెట్ దాడులు జరిగాయని తెలిపింది.​ వీటిని సిరియా ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందని.. ఇజ్రాయెల్​ క్షిపణులను నేలకూల్చేసిందని వెల్లడించింది.

అయితే, విదేశీ భూభాగంలో దాడులు చేసినట్టుగా వచ్చిన వార్తలపై స్పందించేది లేదని ఇజ్రాయెల్​ స్పష్టం చేసింది.

దాడులు ఆపాలి..

మరోవైపు, ఇజ్రాయెల్ చేస్తున్న వరుస దాడులపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని సిరియా డిమాండ్​ చేస్తోంది. దాడులను ఆపేలా ఇజ్రాయెల్​పై ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఒత్తిడి తేవాలని కోరుతోంది. ఈ చర్యలు తమ సార్వభౌత్వాన్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేస్తోంది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెంచేలా ఇజ్రాయెల్​ చర్యలున్నాయని మండిపడుతోంది.

ఇదీ చదవండి: సిరియాలో కారు బాంబు దాడులు- 12 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.