ETV Bharat / international

భద్రతా బలగాల బస్సుపై ఉగ్రదాడి.. 13 మంది సిబ్బంది మృతి - సిరియా భద్రతా బలగాల బస్సుపై ఉగ్రదాడి

Syria militants attack: సిరియాలో భద్రతా సిబ్బంది వాహనంపై ఉగ్రదాడి జరిగింది. ఈ దుర్ఘటనలో 13 మంది సిబ్బంది ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది క్షతగాత్రులయ్యారు.

Syria militants attack
Syria militants attack
author img

By

Published : Mar 7, 2022, 1:31 AM IST

Syria militants attack: సిరియాలో భద్రతా బలగాలు వెళ్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 13 మంది సిబ్బంది మృతి చెందారు. పాల్మీరా ప్రాంతంలో జరిగిన ఈ దాడిలో మరో 18 మంది గాయపడ్డారు. మృతుల్లో పలువురు అధికారులు కూడా ఉన్నట్లు ఆ దేశ అధికారిక మీడియా సంస్థ సనా పేర్కొంది. అత్యాధునికమైన ఆయుధాలతో దాడి చేసినట్లు వెల్లడించింది. అయితే ఈ దాడికి ఎవరు కారణమన్నది తెలియలేదు.

సిరియా అధికారులు.. 2019 నుంచి దేశంలో ప్రాదేశిక నియంత్రణను కోల్పోయినప్పటికీ.. దక్షిణ,మధ్య సిరియాల్లో క్రియాశీలకంగా ఉన్న ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రమూకలు గతంలో ఇటువంటి దాడులకు పాల్పడ్డారు. జనవరిలో పాల్మీరా ప్రాంతంలోనే భద్రతా దళాల వాహనంపై ఐఎస్ ఉగ్రవాదులు రాకెట్లు, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్‌తో కాల్పులు జరిపగా.. ఐదుగురు సైనికులను ప్రాణాలు కోల్పోయారు.

దీంతో తాజాగా దాడి కూడా ఐఎస్​ ఉగ్రవాదులే చేసి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: పేలుళ్లతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి- పుతిన్ లక్ష్యంగా యూకే ఆరు సూత్రాల ప్లాన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.