Syria children killed in US attack: సిరియాలో తిరుగుబాటుదారులే లక్ష్యంగా అమెరికా దళాలు జరిపిన దాడిలో సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం తెల్లవారుజామున జరిపిన దాడిలో 13 మంది పౌరులు మరణించారు. ఇందులో ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నారు. అంతర్గత వలసలు ఎక్కువగా ఉండే ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని అత్మేహ్ అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది.
ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారనే సమాచారం అందుకున్న బలగాలు.. మెరుపు దాడి చేశాయి. ఈ క్రమంలో సాధారణ జనం కూడా మరణించారు. అయితే.. ఈ ఘటనలో ఉగ్రవాదుల మరణాలపై ఎలాంటి సమాచారం లేదు.
ఇడ్లిబ్ ప్రాంతం ఉగ్రమూకలకు స్థావరంగా మారింది. ఇక్కడ ఉగ్రకార్యకలాపాలు విచ్చలవిడిగా జరుగుతుంటాయి. ఇటీవలే ఈశాన్య సిరియాలో ఓ జైలును స్వాధీనం చేసుకోవడానికి 10 రోజుల పాటు ఉగ్రవాదులు దాడులు చేశారు. తిరుగుబాటుదారులపై సిరియా దళాలతో కలిసి అమెరికా దళాలు ఎదురుదాడులు చేస్తున్నాయి. 2019లో అమెరికా దళాలు జరిపిన దాడుల తర్వాత ఇదే అతి పెద్దది.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: మార్కెట్లో తెగిపడిన హైఓల్టేజ్ విద్యుత్తు తీగలు.. 26 మంది మృతి