అఫ్గానిస్థాన్ నంగర్హార్ రాష్ట్రంలోని బాటీకోట్ జిల్లాలో తాలిబన్లు.. పోలీసులపై శుక్రవారం ఆకస్మిక దాడి జరిపారు. ముష్కరులు చేసిన ఈ దాడిలో ఆరుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ మేరకు వివరాలను స్థానిక మీడియా వెల్లడించింది.
మేమే చేశాం..
ఈ ఘటనకు తాము బాధ్యత వహిస్తున్నామని తాలిబన్లు ప్రకటించారు. ఆరుగురు చనిపోయారని వెల్లడించారు. అయితే గాయపడిన వారి సంఖ్య తొమ్మిదిగా ముష్కరులు తెలపడం గమనార్హం. ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నా.. తాలిబన్లు తమ ఆగడాలను కొనసాగిస్తున్నారు.
ఇదీ చూడండి : 'ప్రమాణ స్వీకారం'లో కరోనా మృతులకు నివాళి