ETV Bharat / international

ఇజ్రాయెల్​ నౌకపై దాడి.. ఇరాన్​ పనేనా? - ఇజ్రాయెల్​ బిలియనీర్​ ఇయల్​ ఓఫర్​

ఇజ్రాయెల్​కు చెందిన నౌకలపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగాయి. తాజాగా ఆ దేశ బిలియనీర్​ ఇయల్​ ఓఫర్​కు చెందిన ఓ ఆయిల్​ ట్యాంకర్​పై ఓమన్​ సముద్ర జలాల్లో దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్​, ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ దాడి జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది.

Ship tied to Israel billionaire reportedly attacked
ఇజ్రాయెల్​ నౌకపై దాడి
author img

By

Published : Jul 30, 2021, 3:57 PM IST

Updated : Jul 30, 2021, 5:52 PM IST

ఇజ్రాయెల్​ బిలియనీర్​ ఇయల్​ ఓఫర్​కు చెందిన ఓ నౌకపై అరేబియా సముద్రం ఓమన్​ తీరంలో దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో యునైటెడ్​ కింగ్​డమ్​, రోమానియాకు చెందిన ఇద్దరు నౌక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. కానీ, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను తెలపలేదు.

లైబీరియా నుంచి బయలుదేరిన మెర్సెర్​ స్ట్రీట్​ ఆయిల్​ ట్యాంకర్​.. ఓమన్​ ద్వీపం మసిరాహ్​కు ఈశాన్య సమీపానికి చేరుకున్న క్రమంలో గురువారం రాత్రి ఈ దాడి జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం ఓమన్​ రాజధాని మస్కట్​కు 300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అయితే.. టెహ్రాన్​ అణు ఒప్పందంపై చర్చలు నిలిచిపోయిన క్రమంలో ఇజ్రాయెల్​, ఇరాన్​ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ సమయంలో దాడి జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. నౌకపై దాడి తమ పనేనన్న వాదనను ఇజ్రాయెల్​ అధికారులు తోసిపుచ్చారు.

దర్యాప్తు..

గురువారం రాత్రి జరిగిన దాడిపై దర్యాప్తు చేపట్టినట్లు బ్రిటీష్​ మిలిటరీకి చెందిన యునైటెడ్​ కింగ్​డమ్​ మారిటైమ్​ ట్రేడ్​ ఆపరేషన్స్​ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే.. దాడి గురించి ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ దాడి దోపిడీ ముఠాల పని కాదని అనుమానిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి: సొంత నౌకపైనే ఇరాన్ క్షిపణి దాడి-19 మంది మృతి

Last Updated : Jul 30, 2021, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.