వాషింగ్టన్ పోస్ట్ జర్నలిస్ట్, సౌదీ రచయిత జమాల్ ఖషోగ్గి హత్య కేసులో ఎనిమిది మంది దోషులకు శిక్ష ఖరారు చేసింది రియాద్ క్రిమినల్ కోర్టు.
వీరిలో ఐదుగురికి గరిష్ఠంగా 20 సంవత్సరాల జైలు శిక్ష, ఒకరికి 10 ఏళ్లు, మరో ఇద్దరికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం.
సౌదీ రాచరిక ప్రభుత్వ విధానాలపై ఖషోగ్గీ తరచూ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో 2018 అక్టోబరు 2న టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో సౌదీ దౌత్య కార్యాలయానికి ఆయన వచ్చారు. సౌదీ యువరాజు కోసం పనిచేసే ఏజెంట్లే ఖషోగ్గీని హత్య చేసి ఉంటారని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కోర్టు తీర్పుపై హక్కుల సంఘాలు తీవ్రం విమర్శలు చేశాయి. అసలైన నిందితులు తప్పించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశాయి.