ప్రపంచ ముడిచమురు ఎగుమతిదారుల్లో ఒకటైన సౌదీఅరేబియా.. ఏప్రిల్‌లో ఆసియా చేసే ఎగుమతులను 15 శాతం మేర కుదించనుంది. ఒపెక్ దేశాలు, వాటి భాగస్వామ్య ఒపెక్ ప్లస్ దేశాలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి సౌదీ ఈ మేరకు తగ్గించనుంది. ఇప్పటికే ఏప్రిల్‌లో రోజుకు మిలియన్ బారెళ్ల మేర ఉత్పత్తిని తగ్గించనున్నట్లు సౌదీ తెలిపింది. చైనాకు సౌదీ నుంచి వచ్చే ముడి చమురు స్వల్పంగా తగ్గనుండగా, జపాన్‌కు 10 నుంచి 15 సాతం మేర కోత పడనుంది.
ఆసియా దేశాలపై ప్రభావం..
భారత్‌కు అదనపు ముడిచమురు కోసం భారత రిఫైనరీలు చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చిన సౌదీ ఆరామ్‌కో.. సరాసరిన ప్రతి నెలా భారత్‌కు చేస్తున్న ఎగుమతుల్లో మాత్రం మార్పు చేయబోమని చెప్పింది. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్ చమురు సరఫరాలో ఆంక్షలు ఎత్తేయాలని ఎగుమతిదారులకు విజ్ఞప్తి చేస్తూనే ఉంది. సౌదీ అరేబియా స్వచ్ఛందంగా చమురు ఉత్పత్తి తగ్గిస్తున్నందున.. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పెరుగుతున్న విషయాన్ని కూడా చెబుతూనే ఉంది. ఆసియా దేశాలకు చేస్తున్న ఎగుమతులను సౌదీ నిలిపేయనప్పటికీ ఫిబ్రవరిలో కూడా కోత విధించింది.
ఇదీ చదవండి: ఏడాది గరిష్ఠానికి ముడి చమురు ధరలు