ETV Bharat / international

మక్కా యాత్రపై ఆంక్షల ఎత్తివేతకు సౌదీ నిర్ణయం! - మక్కా వార్తలు

ముస్లింల పవిత్ర పుణ్యక్షేతం మక్కా యాత్రపై ఆంక్షలను ఎత్తివేసేందుకు యోచిస్తోంది సౌదీ అరేబియా. అక్టోబర్​ 4 నుంచి తొలిదశలో రోజుకు 6వేల మంది సౌదీ పౌరులను ఈ యాత్రకు అనుమతించనున్నారు. అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేసిన క్రమంలో.. నవంబర్​ 1 నుంచి విదేశీ యాత్రికులకూ అనుమతులు ఇవ్వనున్నట్లు సౌదీ పేర్కొంది.

Saudi Arabia to lift ban on Mecca pilgrimage
మక్కా యాత్రపై ఆంక్షల ఎత్తివేతకు సౌదీ నిర్ణయం!
author img

By

Published : Sep 23, 2020, 10:58 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ఇస్లాం పవిత్ర క్షేత్రం మక్కాలో.. గత ఏడు నెలలుగా ఉన్న ఆంక్షలను క్రమంగా ఎత్తివేస్తోంది సౌదీ అరేబియా. ఈ క్రమంలో అక్టోబర్​ 4 నుంచి మక్కాలోని ఉమ్రాయాత్రకు సందర్శకులను అనుమతించనున్నట్లు వెల్లడించింది. రోజుకు 6 వేల మందికి ఈ అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఆ దేశ మీడియా నివేదించింది. తొలి దశలో సౌదీ పౌరులు, స్థానికులను మాత్రమే అనుమతించనున్నారు.

మసీదులోకి ప్రవేశించి ఉమ్రాయాత్రను చేపట్టే ముందే.. ఆన్​లైన్​ పోర్టల్​ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. కావాల్సిన తేదీ, సమయాన్ని రిజర్వ్ చేసుకోవాలి. ఆన్​లైన్​ దరఖాస్తులు సెప్టెంబర్​ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. మసీదులో రద్దీని నిరోధించటం, భౌతిక దూరాన్ని పాటించాలనే ఉద్ధేశంతోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొబైల్​ యాప్​ ద్వారా కూడా తమ యాత్ర మార్గాలను, సమావేశాలను ఎంపిక చేసుకునే వీలు కల్పించారు.

అక్టోబర్​ 18 నుంచి రెండో దశ..

అక్టోబర్​ 18 నుంచి రెండో దశ ప్రారంభం కానుంది. ఇందులో గరిష్ఠంగా రోజుకు 15000 మంది యాత్రికులను యాప్​ ద్వారా కేటాయించిన సమయాల్లో ప్రార్థనలకు అనుమతించనున్నారు. ఈ మసీదులో క్యూబ్​ ఆకారంలో ఉన్న కాబాను ముస్లింలు రోజుకు ఐదుసార్లు ప్రార్ధిస్తారు.

విదేశీయులకు నవంబర్​ 1 నుంచి..

ఉమ్రాయాత్ర చేపట్టాలనుకునే విదేశీ ముస్లింలకు నవంబర్​ 1 నుంచి అనుమతులు ఇస్తామని సౌదీ అరేబియా హోంశాఖ ప్రకటించింది. ఈ ఏడాది మార్చ్​ తర్వాత ఇటీవలే అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు ఎత్తివేసింది సౌదీ. ఈ క్రమంలో విదేశీ ముస్లింలు ఉమ్రాయాత్రకు వెళ్లే అవకాశం లభించనుంది.

కరోనా మహమ్మారి వ్యాప్తికి ఈ యాత్ర గ్లోబల్​ సూపర్​-స్ప్రైడర్​గా మారుతుందన్న ఆందోళనతో.. గత జులైలో చాలా తక్కువ మందితో హాజ్​ను నిర్వహించింది సౌదీ. ఆన్​లైన్​ ద్వారా దరఖాస్తు చేసుకున్న స్థానికులను మాత్రమే ఎంపిక చేసి ప్రార్థనలకు అనుమతించింది. ప్రతి ఏటా సుమారు 20 లక్షల మంది ఈ యాత్రకు వస్తారు. కానీ గత జులైలో కేవలం రోజుకు 1000 మందిని మాత్రమే ప్రార్థనలకు అవకాశం కల్పించారు. జులైలో నిర్వహించిన హాజ్​ విజయవంతమైన నేపథ్యంలో ఆంక్షలను సడలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:ఉమ్రా యాత్రలకు పయనమైన ముస్లిం సోదరులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.