తమ దేశంలో పర్యటించే విదేశీయులకు వస్త్రధారణ, ప్రవర్తన విషయంలో ఆంక్షలు విధించింది సౌదీ అరేబియా. ఈ ఆంక్షలను ఉల్లంఘిస్తే జరిమాన తీవ్ర స్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. పర్యాటకులు పద్ధతిగా ఉండాలని 19 కొత్త నియమాలు తీసుకొచ్చింది సౌదీ.
తమ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తించకూడదని తెల్చిచెప్పింది. ప్రముఖ యాత్రా స్థలాల్లో ఆడవారు బిగుతుగా ఉండే వస్త్రాలు ధరించకూడదని.. తమ భూజాలు, మోకాళ్లు దాగి ఉండేలా దుస్తులు వేసుకోవాలి ఈ ఆంక్షల్లో ఉంది.
బహిరంగ ప్రదేశాల్లో ప్రజల ప్రవర్తనపై ఉండే చట్టాల గురించి విదేశీయులకు అవగాహన ఇవ్వడానికే ఈ ఆంక్షలు విధిస్తున్నట్టు సౌదీ వెల్లడించింది.
ఆర్థికవ్యవస్థ మొత్తం చమురుపైనే ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడేందుకు.. పర్యటంగా వృద్ధిచెందే దిశగా అడుగులు వేస్తోంది సౌదీ అరేబియా. 2030 నాటికి దేశ పర్యాటక రంగం నుంచి అధిక ఆదాయాన్ని ఆర్జించాలన్న లక్ష్యం పెట్టుకుంది.
యూఎస్, ఆస్ట్రేలియా, యురోపియన్ దేశాలతో పాటు 49 దేశాలకు ఈ-వీసా, వీసాలను జారీ చేస్తామని తెలిపింది. ఇందుకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌నూ ప్రారంభించింది. విదేశీ పర్యాటకులకు నిర్దేశించిన నిబంధనల వివరాలను ఈ సైట్‌లో ఉంచినట్లు తెలిపింది.
ఇదీ చూడండి : థాయ్‌లాండ్‌లో ట్రక్కు బోల్తా- 13మంది దుర్మరణం