ETV Bharat / international

ఈసారి వర్చువల్​ పద్ధతిలో జీ20 శిఖరాగ్ర సదస్సు

జీ-20 దేశాల సదస్సుకు ముహూర్తం ఖరారైంది. సౌదీ అరేబియా వేదికగా నవంబర్​లో ఈ భేటీ జరగనుంది. కరోనా నేపథ్యంలో ఈ సారి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశం కానున్నాయి సభ్యదేశాలు.

Saudi Arabia: G-20 gathering of world leaders to be virtual
ఈసారి వర్చువల్​ పద్ధతిలో జీ20 శిఖరాగ్ర సదస్సు
author img

By

Published : Sep 28, 2020, 8:02 PM IST

జీ-20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఈసారి వర్చువల్​గా జరగనుంది. నవంబర్​లో జరిగే ఈ సమావేశానికి సౌదీ అరేబియా వేదిక కానుంది.

సౌదీ రాజు మహమ్మద్​ బిన్​ సల్మాన్​ అధ్యక్షతన నవంబర్​ 21, 22న ఈ సదస్సు ఉంటుందని సౌదీ అరేబియా తెలిపింది. కరోనా నుంచి ప్రజల ప్రాణాలను రక్షించడం, మహమ్మారి వల్ల పతనమైన ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం, ఉత్తమ భవిష్యత్తుకు పునాది వేయడం అనే అంశాలపై ఈ సదస్సు కొనసాగుతుందని తెలిపింది. వ్యాక్సిన్​ ఉత్పత్తిలో జీ-20 దేశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొంది.

తొలుత రియాద్​లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని సౌదీ అరేబియా భావించింది. సదస్సుకు రానున్న వివిధ దేశాల సారథులకు స్వాగత సత్కారాలు అందించాలని సౌదీ రాజు మహమ్మద్​ బిన్​ సల్మాన్​ అనుకున్నారు. కానీ, కరోనా ప్రభావంతో ఈ ప్రణాళికలు అన్నీ తారుమారయ్యాయి.

ఆ దేశాలు పాల్గొంటాయా!

రెండేళ్ల క్రితం జర్నలిస్ట్ జమాల్ ఖషోగి హత్య.. సౌదీ అరేబియాలో కలకలం రేపింది. ఈ వ్యవహారంపై మహమ్మద్​ బిన్​ సల్మాన్​ సర్వత్రా విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ సమావేశాన్ని నిషేధించాలని అనేక మానవ హక్కుల సంఘాలు డిమాండ్​ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో... కెనడా, జర్మనీ దేశాలు ఈసారి పాల్గొనడం సందేహంగానే ఉంది. రష్యా మాత్రం.. తాము ఈ సదస్సులో పాల్గొంటామని స్పష్టం చేసింది.

మహమ్మారిని ఎదుర్కోవడానికి జీ-20 దేశాలు ఉమ్మడి కార్యాచరణకు నోచుకోవడంపై విమర్శలు ఎదుర్కొన్నాయి. మార్చి నెలలో.. జీ-20 దేశాలు చివరిసారిగా సమావేశమయ్యాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.