ఇరాక్‌లోని నజాఫ్ నగరంలో.. ఇస్లాం షియా మత పెద్ద, గ్రాండ్ అయతొల్లా అలీ అల్-సిస్థానీతో పోప్ ప్రాన్సిస్ సమావేశమయ్యారు. 90 ఏళ్ల సిస్థానీ.. ఇరాక్‌లోనే అత్యంత శక్తిమంతమైన షియా నేత. తన పర్యటనలో భాగంగా పోప్ రెండో రోజు శనివారం ఈ చర్చల్లో పాల్గొన్నారు.
క్రైస్తవులకూ సమాన హక్కులు..
ఇరువురి మధ్య చారిత్రక సమావేశం 40 నిమిషాలు సాగింది. ఇరాక్‌లోని క్రైస్తవులకూ మిగతా ప్రజలతో సమానమైన హక్కులుంటాయని ఈ సందర్భంగా పోప్‌తో సిస్థానీ చెప్పినట్లు తెలుస్తోంది. సాధారణంగా అతిథులకు తన కుర్చీలోంచే ఆహ్వానం పలికే అల్-సిస్థానీ.. ద్వారం వరకు వచ్చి 84 ఏళ్ల పోప్‌ను తన గదిలోకి తీసుకువెళ్లారు. తర్వాత పోప్ ఫ్రాన్సిస్ పురాతన నగరం ఉర్ను దర్శించారు. అక్కడ ప్రార్థనలు చేశారు.
ఇదీ చదవండి: ఇరాక్‌లోని అమెరికా స్థావరాలపై దాడి