ఫైజర్, బయోఎన్‌టెక్ సంస్థలు సంయుక్తంగా రూపొందించిన కొవిడ్ వ్యాక్సిన్.. ఒకే డోసు తీసుకున్నప్పటికీ తీవ్రమైన అనారోగ్యం లేదా ప్రాణహాని నుంచి బయటపడేస్తుందని తేలింది. ఇజ్రాయెల్‌లో ఇప్పటికే 5లక్షల మందికిపైగా ఫైజర్ టీకాను ఇవ్వగా ఈ మేరకు తేలిందని పరిశోధనా ఫలితాలను ప్రచురించారు. ఫైజర్ టీకాను అన్ని వయసుల సాధారణ ప్రజానికానికీ, అన్ని రకాల ఆరోగ్య పరిస్థితులు ఉన్నవారికి ఇవ్వొచ్చని ఆ పరిశోధన వెల్లడించింది.
ఫైజర్ వ్యాక్సిన్ రెండు టీకాలు తీసుకుంటే.. 92శాతం ప్రభావం ఉంటుందని పరిశోధన తెలిపింది. ఒకటే డోసు తీసుకుంటే.. 62శాతం ప్రభావం ఉంటుందని పేర్కొంది. తొలి డోసు తీసుకున్న రెండు, మూడు వారాల్లో.. మరణాల రేటును 72శాతం తగ్గిస్తుందని వెల్లడైంది. 70ఏళ్లుపైబడిన వారిలోనూ.. ఫైజర్ వ్యాక్సిన్ కుర్రాళ్లలో మాదిరి పనిచేస్తోందని ఇజ్రాయెల్‌లో చేసిన పరిశోధన వివరించింది.
ఇదీ చదవండి:దేశవ్యాప్తంగా మాస్కుల పంపిణీకి బైడెన్ సిద్ధం