ETV Bharat / international

పెగసస్​ వ్యవహారంపై ఇజ్రాయెల్​ దర్యాప్తు షురూ ​ - పెగసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారం

పెగసస్‌ స్పైవేర్‌ను రూపొందించిన ఎన్​ఎస్​ఓపై వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభించింది ఇజ్రాయెల్​. ఆ దేశ రక్షణ శాఖకు చెందిన ఎగుమతుల నియంత్రణ విభాగం, జాతీయ భద్రతా మండలికి చెందిన సిబ్బంది ఇందుకు సంబంధించి వేర్వేరు చోట్ల సోదాలు జరిపారు.

Pegasus snooping scandal
పెగసస్​పై ఇజ్రాయెల్​ దర్యాప్తు
author img

By

Published : Jul 30, 2021, 3:22 PM IST

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న పెగసస్‌ హ్యాకింగ్‌ వ్యవహారంపై ఇజ్రాయెల్‌ దర్యాప్తు ప్రారంభించింది. పెగసస్‌ స్పైవేర్‌ను రూపొందించిన ఎన్​ఎస్​ఓ గ్రూప్‌ కార్యాలయాల్లో ఆ దేశానికి చెందిన వివిధ దర్యాప్తు సంస్థలు సోదాలు నిర్వహించాయి. ఇజ్రాయెల్‌ రక్షణ శాఖకు చెందిన ఎగుమతుల నియంత్రణ విభాగం(ఈసీడీ), జాతీయ భద్రతా మండలికి చెందిన సిబ్బంది ఈ సోదాల్లో పాల్గొన్నారు.

ఈసీడీ ఇచ్చిన అనుమతుల మేరకు ఎన్​ఎస్​ఓ గ్రూప్‌ పని చేసిందా లేదా అన్న అంశంపై ప్రధానంగా దర్యాప్తు సాగుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్​ఎస్​ఓ గ్రూప్‌.. పెగసస్‌ స్పైవేర్‌ను ఉగ్రవాదం, నేరాల కట్టడి కోసం విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది.

అయితే భారత్‌ సహా వివిధ దేశాల్లోని రాజకీయ నాయకులు, పాత్రికేయులు, న్యాయమూర్తులపై పెగసస్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ఫోన్ల హ్యాకింగ్‌ జరిగిందని ఇటీవల ద వైర్‌ వెబ్‌సైట్‌ వెల్లడించింది. ఈ ఆరోపణల పరిశీలనకు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం గత వారమే ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇదీ చూడండి: 'పెగసస్​తో ఫోన్ల హ్యాకింగ్​ వాస్తవమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.