సిరియాలో అధ్యక్ష ఎన్నికలను మే 26న నిర్వహించనున్నట్లు ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ హమ్మౌద్ సబ్బాగ్ ప్రకటించారు. నామినేషన్లు దాఖలు చేయడానికి సోమవారం నుంచి 10 రోజుల గడువు ఉంటుందని తెలిపారు. విదేశాల్లోని సిరియన్లు మే 20న ఓటేయవచ్చని వెల్లడించారు.
ఎన్నికల్లో గెలుపొందినవారు ఏడు సంవత్సరాలు అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది. దేశ ప్రస్తుత అధ్యక్షుడు బషర్ అసద్కే అనుకూలంగా ఫలితాలు ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయనకు వ్యతిరేకంగా వేరే అభ్యర్థులు పోటీకి దిగడం కూడా సందేహంగానే ఉంది. ఒకవేళ మరో వ్యక్తి ఎన్నికల బరిలో దిగినా.. అది నామమాత్రపు పోటీగానే ఉంటుందని రాజకీయవేత్తలు అంచనా వేస్తున్నారు.
ఎన్నికల్లో అవకతవతకలపై అమెరికా గత నెల్లోనే సిరియా అధ్యక్షుడికి హెచ్చరికలు పంపింది. ఎన్నికల ప్రక్రియ సక్రమంగా, ఐరాస పర్యవేక్షణలో జరిగితేనే వాటి ఫలితాలను తాము ఆమోదిస్తామని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: