ETV Bharat / international

ఈ ఫిల్టర్​ పెట్టుకుంటే మాస్కు మార్చక్కరలేదు! - Coronaviurs mask filter

కరోనా వైరస్​ నుంచి రక్షణ కల్పించే ఎన్​95 మాస్కు​ మరింత సమర్థవంతంగా పనిచేసేలా కొత్త ఫిల్టర్​ను అభివృద్ధి చేశారు పరిశోధకులు. దీనిని అవసరమైనప్పుడు మార్చుకోవచ్చని తెలిపారు. ఈ ఫిల్టర్​కు ఎన్​95 మాస్కు​ కంటే సూక్ష్మ రంధ్రాలు ఉంటాయని వెల్లడించారు. అందువల్ల వ్యాధికారక వైరస్​లను సమర్థవంతంగా అడ్డుకోగలదని చెప్పారు.

New replaceable, more efficient filter for N95 masks developed
ఆ ఫిల్టర్​తో మరింత శక్తిమంతంగా ఎన్​95 మాస్క్​
author img

By

Published : May 22, 2020, 7:37 PM IST

కరోనా వైరస్​ను సమర్థవంతంగా అడ్డుకోవడానికి కొత్త వడపోత(ఫిల్టర్​)ను అభివృద్ధి చేశారు పరిశోధకులు. ఇది వైరస్​ కణాలను అడ్డుకునే ఎన్​95 మాస్కు​ను మరింత శక్తిమంతంగా మార్చనుంది. ఈ ఫిల్టర్​ను అవసరమైనప్పుడు మార్చుకోవచ్చని వెల్లడించారు. ఫలితంగా మాస్కులు ఎక్కువసారి వాడొచ్చని స్పష్టం చేశారు.

సాధారణ ఎన్​95 మాస్కు​ కంటే ఫిల్టర్​కు చిన్న రంధ్రాలు ఉంటాయని, అందువల్ల వైరస్​ కణాలను సమర్థవంతంగా అడ్డుకోగలదని సౌదీ అరేబియాలోని కింగ్​ అబ్దుల్లా యూనివర్శిటీ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ (కేఏయూఎస్​టీ) పరిశోధకులు తెలిపారు.

85శాతం అడ్డుకుంటుంది!

ప్రస్తుతం అందుబాటులో ఉన్నవి అత్యున్నత స్థాయిలో రక్షణ కల్పించినప్పటికీ, వాటికి కొన్ని పరిమితులు ఉన్నాయని ఏసీఎస్​ నానో జర్నల్​లో పేర్కొన్నారు పరిశోధకులు. 300 నానోమీటర్లు కంటే చిన్నగా ఉన్న వైరస్​ కణాలను ఎన్​95 మాస్కు​ 85శాతం మాత్రమే అడ్డుకుంటుందని చెప్పారు. అయితే సార్స్​కోవ్​-2... 65 నుంచి 125 నానో మీటర్ల పరిమాణంలో ఉంటుందని తెలిపారు. దాని వల్ల కొన్ని వ్యాధికారక వైరస్​లు ముక్కు, నోటిలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. తాజా ఫిల్టర్​తో వాటిని కూడా అడ్డుకోవచ్చని తెలిపారు.

సాయం చేయాలనే..

మాస్కుల కొరత ఉన్నందు వల్ల వైద్య సిబ్బంది ఎన్95 మాస్కు​లను పదేపదే వాడుతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి సాయం చేయాలనే ఉద్దేశంతో.. వైరస్​ కణాలను మరింత సమర్థవంతంగా అడ్డుకొనే ఫిల్టర్​ను తయారు చేసినట్లు మహమ్మద్​ ముస్తఫా, అతని సహచరులు తెలిపారు. ఎన్​95 మాస్కు​ మార్చకుండా ఈ ఫిల్టర్​ను మాత్రమే మార్చుకోవడం వల్ల కొరతను నివారించవచ్చని స్పష్టం చేశారు.

తొలుత రసాయనాలు, లిథియోగ్రఫీని ఉపయోగించి సూక్ష్మ రంధ్రాలు గల సిలికాన్​ ఆధారిత ఫిల్టర్​ అభివృద్ధి చేసినట్లు పరిశోధకులు తెలిపారు. తర్వాత 5 నుంచి 55 నానోమీటర్లు రంధ్రాల పరిమాణంలో ఫిల్టర్​ తయారు చేయడానికి.. రియాక్టివ్ అయాన్ ఎటాచింగ్​ అనే ప్రక్రియను ఉపయోగించినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: కిమ్​ జోంగ్​ మళ్లీ మాయం- ఏం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.