ETV Bharat / international

'పెగాసస్​తో కోట్ల మంది ప్రశాంతంగా నిద్రపోతున్నారు'

పెగాసస్​ లాంటి సాఫ్ట్​వేర్​లతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నారని చెప్పింది దాని రూపకర్త ఎన్​ఎస్​ఓ గ్రూప్(NSO Pegasus). విద్రోహ శక్తులను అణిచివేయడంలో ప్రభుత్వాలకు ఈ సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపింది.

pegasus
పెగాసస్
author img

By

Published : Jul 24, 2021, 5:24 PM IST

పెగాసస్​పై​ భారత్​ సహా ప్రపంచదేశాల్లో తీవ్ర దుమారం చెలరేగుతున్న వేళ ఈ నిఘా సాఫ్ట్​వేర్​ను వెనకేసుకొచ్చింది దాని రూపకర్త, ఇజ్రాయెల్ సైబర్​ భద్రత సంస్థ ఎన్​ఎస్​ఓ గ్రూప్(NSO Pegasus). నిఘా, ప్రభుత్వ సంస్థల వద్ద ఉండే ఇలాంటి సాంకేతికతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రశాంతంగా నిద్రపోతున్నారని, వీధుల్లో భద్రత లభిస్తోందని తెలిపింది.

"ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు రాత్రుళ్లు ప్రశాంతంగా నిద్రపోవడం, వీధుల్లో సురక్షితంగా నడవగలుగుతున్నారంటే పెగాసస్ వంటి సాంకేతికలే కారణం. అవి.. ఎండ్​ టు ఎండ్​ ఎన్​క్రిప్షన్​ ముసుగులో దాగి ఉన్న అసాంఘిక శక్తులను, ఉగ్రవాదాన్ని నిరోధించి, నేర దర్యాప్తులో నిఘా సంస్థలు, ప్రభుత్వాలకు సహాయపడతాయి. మెసేంజింగ్, సామాజిక మాధ్యమాల్లో హానికారక చర్యల పర్యవేక్షణకు చాలా దేశాల్లో చట్టాలు అనుమతించవు. అలాంటి పరిస్థితుల్లో వాటి కళ్లు గప్పి నేరాలకు పాల్పడేవారిని గుర్తించడానికి ఎన్​ఎస్​ఓ సహా సైబర్ ఇంటెలిజెన్స్​ సంస్థలు నిఘా సాధనాలను ప్రభుత్వాలకు అందిస్తుంటాయి."

- ఎన్​ఎస్​ఓ

పెగాసస్​ను విక్రయించిన తర్వాత ఆ సాంకేతికతను తాము నిర్వహించమని, దాని ద్వారా క్లైయింట్లు సేకరించిన సమాచారం కూడా తమకు అందుబాటులో ఉండదని ఎన్​ఎస్​ఓ స్పష్టం చేసింది.

పెగాసస్​ను పాత్రికేయులు, హక్కుల కార్యకర్తలు, రాజకీయ నాయకులు సహా ఇతర కీలక వ్యక్తుల ఫోన్లపై నిఘా కోసం వాడుతున్నట్లు వచ్చిన మీడియా కథనాలతో వ్యక్తిగత గోప్యతపై తీవ్ర ఆందోళన నెలకొంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.