Kuwait Lion Video: కువైట్లో ఓ మహిళ సింహాన్ని ఏం చక్కా మోసుకెళ్లింది. పిల్లలు మారాం చేస్తుంటే తల్లి ఎత్తుకెళ్లినట్లు దాన్ని తీసుకెళ్లింది . ఈ దృశ్యం చూసినవారంతా షాకయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.
-
My neighbor and her dog seemed to not be getting along last night pic.twitter.com/fUGcpuTkMY
— Arlong (@ramseyboltin) January 3, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">My neighbor and her dog seemed to not be getting along last night pic.twitter.com/fUGcpuTkMY
— Arlong (@ramseyboltin) January 3, 2022My neighbor and her dog seemed to not be getting along last night pic.twitter.com/fUGcpuTkMY
— Arlong (@ramseyboltin) January 3, 2022
వన్య ప్రాణులను పెంచుకునే సంప్రదాయం
సాధారణంగా ఎక్కడైనా కుక్కలు, పిల్లుల వంటి జంతువులను పెంచుకుంటారు. అయితే కువైట్లో సింహం, పులులు వంటి భయంకరమైన వన్యప్రాణులను పెంచుకుంటారు. అయితే ఇది అక్కడ చట్టరీత్యా నేరం. అయినప్పటికీ తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని వదులుకోలేక ప్రభుత్వానికి తెలియకుండా వాటిని కొందరు పెంచుకుంటున్నారు. చట్టాలు చేసినంత మాత్రాన తమ సంప్రదాయాన్ని వదులుకోలేమని చెబుతున్నారు. అయితే దీనిని జంతుప్రేమికులు విమర్శిస్తున్నారు. ఇలా చేయడం తగదని.. వన్యప్రాణులను అడవిలోనే వదిలిపెట్టాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: మాస్కు ధరించమంటే.. బట్టలు విప్పేసి యువతి హల్చల్