ETV Bharat / international

ఇరాన్​, టర్కీ విదేశీ మంత్రులతో జైశంకర్​ భేటీ - అఫ్గాన్​ అధ్యక్షునితో జైశంకర్​ చర్చలు

తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో అఫ్గాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ గనీతో, ఇరాన్​, టర్కీ విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు భారత విదేశీ వ్యవహారలశాఖ మంత్రి ఎస్​. జైశంకర్. మంగళవారం ఇక్కడ జరిగే 'హార్ట్​​ ఆఫ్ ఏసియా' సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

external minister Jaishankar, President Ghani exchange views on peace process in Afghanista
అఫ్గాన్​ అధ్యక్షునితో జైశంకర్​ చర్చలు
author img

By

Published : Mar 30, 2021, 5:48 AM IST

తజికిస్థాన్​లో పర్యటిస్తున్న భారత విదేశీ వ్యవహారలశాఖ మంత్రి ఎస్​. జైశంకర్.. సోమవారం ఆ దేశ రాజధాని దుషాంబేలో అఫ్గాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ గనీతో, ఇరాన్​, టర్కీ విదేశాంగ మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంగళవారం ఇక్కడ జరిగే 'హార్ట్​ ఆఫ్ ఏసియా' సదస్సులో ఆయన పాల్గొంటారు. ఇరాన్ విదేశాంగ మంత్రి జావెద్​ జరీఫ్​తో మంచి చర్చ జరిగిందని చాబహార్​ పోర్టు ప్రాజెక్టు, ద్వైపాక్షిక సహకారంపై మాట్లాడుకున్నామని జైశంకర్​ ట్విట్టర్​లో వెల్లడించారు. అంతకు ముందు ఆయన.. దుషాంబే-చోర్తుత్​ జాతీయ రహదారి ప్రాజెక్టు పనులను పరిశీలించారు. భారత సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్​వో) ఇక్కడ చేపడుతున్న పనులు బాగున్నాయని కితాబిస్తూ ఆయన మరో ట్వీట్​ చేశారు.

చాబహార్​ రేవుతో వాణిజ్య సంబంధాల బలోపేతం

ఇరాన్​ దక్షిణ తీరాన, సిస్థాన్​-బలూచిస్థాన్​ ప్రావిన్స్​లో ఉన్న చాబహార్​ రేవును భారత్, ఇరాన్,​ ఆఫ్గానిస్థాన్​లు కలిసికట్టుగా నిర్మిస్తున్నాయి. ఇది తమ వాణిజ్య సంబంధాల బలోపేతానికి తోడ్పడుతుందని ఆ దేశాలు భావిస్తున్నాయి.

అష్రఫ్​ గనీతో శాంతి చర్చలు..

అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడు అష్రఫ్​ గనీ, భారత విదేశీ వ్యవహారలశాఖ మంత్రి ఎస్​. జైశంకర్.. శాంతిపై పరస్పరం తమ అభిప్రాయాలను పంచుకున్నారు. యుద్ధంతో దెబ్బతిన్న దేశంలో భారత్​ అనుసరించే శాంతి విధానాలను జైశంకర్​ వివరించారు. 'హార్ట్​ ఆఫ్ ఏసియా' కార్యక్రమానికి ముందే ఈ మేరకు చర్చలు జరిపినట్లు ట్విట్టర్ వేదికగా జైశంకర్​ వెల్లడించారు.

ఇదీ చదవండి: భారత్​-పాక్​ స్నేహగీతంపై చైనా హర్షం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.