ఇజ్రాయెల్ గొలాన్ పర్వత ప్రాంతంలోని సరిహద్దుల వద్ద రహదారుల పక్కన పేలుడు పదార్థాలను గుర్తించాయి ఆ దేశ భద్రతా దళాలు. దానికి ప్రతీకారంగా.. సిరియాలోని ఇరాన్‌కు చెందిన స్థావరాలపై తమ యుద్ధవిమానాలు దాడి చేసినట్లు వెల్లడించింది ఇజ్రాయెల్ సైన్యం.
"ఇరాన్ బలగాల నేతృత్వంలోని సిరియా దళాలు ఐఈడీలను సరిహద్దుల వద్ద పేలుడు పదార్థాలను అమర్చాయి. ఇరాన్ ఎలైట్ కుడ్స్ ఫోర్స్, సిరియన్ మిలిటరీకి చెందిన ప్రధాన కార్యాలయాలు, విమాన నిరోధక క్షిపణి బ్యాటరీ వంటివి లక్ష్యంగా దాడులు చేపట్టాం "
- ఇజ్రాయెల్ సైన్యం.
ఇరాన్‌ను తమకు అతిపెద్ద ముప్పుగా భావిస్తోంది ఇజ్రాయెల్. సిరియాలో ముఖ్యంగా తమ సరిహద్దు ప్రాంతాల్లో ఇరాన్ బలగాలు ఉండటాన్ని వ్యతిరేకిస్తోంది. సిరియాలోని ఇరాన్ సంబంధిత సైనిక లక్ష్యాలపై ఇజ్రాయెల్ ఇప్పటి వరకు వందల సార్లు దాడులు చేసింది. అయితే ఆ దాడులకు బాధ్యత వహించడం చాలా అరుదు.
ఇదీ చూడండి: అఫ్గాన్‌లో బాంబు దాడి.. ఐదుగురు భద్రతా సిబ్బంది మృతి