ఇజ్రాయెల్- గాజాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెలరోజులు కూడా కాకముందే బుధవారం ఇరు వర్గాల మధ్య మరోసారి యుద్ధ ఛాయలు కనిపించాయి. తమ భూభాగంలోకి పేలుడు బెలూన్లను వదిలారని ఆరోపించిన ఇజ్రాయెల్.. గాజాపై వైమానిక దాడులు చేసింది. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన చేసింది.
"మేము హమాస్ కాంపౌండ్‌లో దాడి చేశాము. రానున్న రోజుల్లో ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం."
-- ఇజ్రాయెల్ ఆర్మీ
గాజా నగరం, సిటీ ఆఫ్ ఖాన్ యూనిస్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులు చేసినట్లు స్పుత్నిక్ మీడియా పేర్కొంది. గతనెలలో 11 రోజుల పాటు పాలస్తీనాలోని హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య సంఘర్షణ జరిగింది. ఇరువర్గాలు పరస్పరం రాకెట్ దాడులు చేసుకున్నాయి.
ఇదీ చదవండి : గాజాపై కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ఆమోదం
కొత్త ప్రభుత్వంతో ఇజ్రాయెల్ పునర్నిర్మాణం జరిగేనా?