ETV Bharat / international

కొవిడ్ ఆస్పత్రిలో ప్రమాదం- 82 మంది మృతి - injured people in iraq bagdhad hospital fire

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రిలో అగ్ని ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 82కు చేరింది. మరో 110 మంది గాయపడ్డారు.

Baghdad hospital fire.
'బాగ్దాద్​' ఘటన
author img

By

Published : Apr 25, 2021, 3:40 PM IST

Updated : Apr 25, 2021, 4:05 PM IST

ఇరాక్​ రాజధాని బాగ్దాద్​లో కొవిడ్​ ఆస్పత్రిలో ఆక్సిజన్​ సిలిండర్​ పేలిన ఘటనలో మృతుల సంఖ్య 82కు పెరిగింది. మరో 110 మంది గాయపడ్డారు. ఈ మేరకు ఇరాన్​ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. మృతుల్లో 28 మంది వెంటిలేటర్​పై చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. ​

ఇబ్న్​ అల్​-ఖతీబ్​ ఆస్పత్రిలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన స్థలంలో చాలా వరకు కాలిపోయిన మృతదేహాలు ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

ప్రమాద సమయంలో 120 మంది రోగులు ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆస్పత్రిలో ఓ ఆక్సిజన్​ సిలిండర్​ పేలడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని చెప్పాయి. ఆస్పత్రి వర్గాలు అందించిన సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది.. మంటలు అదుపు చేశారు. సహాయకచర్యలు చేపట్టారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: 'కరోనాపై పోరులో భారత్​కు అండగా ఉంటాం'

Last Updated : Apr 25, 2021, 4:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.