ETV Bharat / international

ఆంక్షలపై ఇరాన్​ ఎదురుదాడి- ఎత్తివేతకు డెడ్​లైన్​

అమెరికా ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఇరాన్​... ఎదురుదాడికి దిగింది. 2015 అణు ఒప్పందంలోని కొన్ని అంశాలను ఉల్లంఘిస్తున్నట్లు ప్రకటించింది. ఆంక్షల ఎత్తివేతకు చర్యలు తీసుకునేందుకు బ్రిటన్​, ఫ్రాన్స్​, రష్యా, చైనా, జర్మనీకి 60రోజులు గడువు ఇచ్చింది ఇరాన్.

ఇరాన్​
author img

By

Published : May 8, 2019, 7:11 PM IST

వివాదాస్పద అణు కార్యక్రమం విషయంలో దూకుడు పెంచింది ఇరాన్. 2015 ఒప్పందంలోని కొన్ని అంశాలను ఉల్లంఘిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా ఆంక్షలు పునరుద్ధరించిన నేపథ్యంలో ఈ మేరకు బ్రిటన్​, ఫ్రాన్స్​, రష్యా, చైనా, జర్మనీ దేశాలకు అల్టిమేటం జారీ చేసింది. 60 రోజుల్లోగా ఆంక్షల ఎత్తివేతకు చర్యలు చేపట్టాలని కోరింది. లేని పక్షంలో 2015 ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించి.. పరిమితికి మించి యురేనియం నిల్వ చేస్తామని హెచ్చరించింది.

ఇరాన్​పై ఇటీవలే ఆంక్షలు పునరుద్ధరించింది అమెరికా. తమపై దాడికి ఇరాన్​ కుట్ర పన్నుతోందని ఆరోపించింది. ముందు జాగ్రత్తగా యుద్ధనౌకలు, యుద్ధ విమానాలు మోహరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్​ తాజా ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ నేపథ్యం

ఇరాన్​ వివాదాస్పద అణు కార్యక్రమాలను ఆపేలా 2015లో ఒప్పందం కుదిరింది. ఈ ఒడంబడికలో అమెరికాతో పాటు బ్రిటన్​, ఫ్రాన్స్​, రష్యా, చైనా, జర్మనీ భాగస్వాములు. ఒప్పందం ప్రకారం.. ఇరాన్​ అణు కార్యక్రమాలపై పరిమితులు విధించారు. వాటికి లోబడి ఇరాన్​ వ్యవహరిస్తే ఆ దేశంపై అంతర్జాతీయంగా ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తామని హామీ ఇచ్చారు.

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్​ ట్రంప్ ఎన్నికయ్యాక ఒప్పందంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదో చెత్త ఒప్పందమంటూ గతేడాది వైదొలిగిన అమెరికా... ఇరాన్​పై ఆంక్షలను పునరుద్ధరించింది. ఈ చర్య ఇరాన్​ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బగా మారింది. ఈ ఏకపక్ష చర్యపై ఇరాన్ అభ్యంతరం తెలిపింది. ఒప్పందానికి లోబడి వ్యవహరించినా... ఆంక్షలు పునరుద్ధరించటాన్ని వ్యతిరేకించింది.

60 రోజుల గడువులో ఆంక్షల నుంచి విముక్తి కలగపోతే ఒప్పందంలోని మరిన్ని నిబంధనలను ఉల్లంఘిస్తామని ఇరాన్ ప్రకటించింది. పరిమితికి మించి యురేనియం, భార జలాలను నిల్వ చేస్తామని ఇతర సభ్య దేశాలను హెచ్చరించింది. అణు ఒప్పందాన్ని సంస్కరించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది.

"అమెరికా మాటను శాసనంగా మీరు భావిస్తున్నారు. కానీ మీకూ బాధ్యతలు ఉన్నాయి. ఈ ఒప్పందం ఎన్నో ఏళ్ల నాటిది. ఫలితంగా ఇప్పుడు దానితో ఎలాంటి ఫలితాలు రావట్లేదు. ఆ ఒప్పందానికి కొన్ని మరమ్మతులు అవసరం. అంటే దాన్ని రద్దు చేయమని కాదు."

-హసన్​ రౌహానీ, ఇరాన్​ అధ్యక్షుడు

ఇతర దేశాల మాట

అమెరికా పునరుద్ధరించిన ఆంక్షలను తొలగించేలా కృషి చేస్తున్నామని బ్రిటన్​, ఫ్రాన్స్​, జర్మనీ తెలిపాయి. ఇదో అందమైన అబద్ధమని ఇరాన్​ కొట్టిపారేసింది. ఏకపక్షంగా ఆంక్షలు విధించడాన్ని చైనా తప్పుబట్టింది. అగ్రరాజ్యం పునఃపరిశీలన చేసుకోవాలని సూచించింది.

ఇరాన్​పై అనవసరంగా ఒత్తిడి తెస్తున్నారని రష్యా ఆరోపించింది. ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది.

ఇదీ చూడండి: 'భారత్​కు శాశ్వత సభ్యత్వం ఇచ్చితీరాల్సిందే'

RESTRICTION SUMMARY: 24 HOUR NEWS ACCESS ONLY / NO ACCESS EVN / NO ACCESS FRANCE
SHOTLIST:
BFM/RMC - 24 HOUR NEWS ACCESS ONLY / NO ACCESS EVN / NO ACCESS FRANCE
Paris - 8 May 2019
1. SOUNDBITE (French) Jean-Jacques Bourdin, journalist: ++INCLUDES MULTIPLE CAMERA ANGLES INCLUDING SPLIT SCREEN++
"Iran has announced they want to resume their nuclear activities. Worrisome?"
2. SOUNDBITE (French) Florence Parly, French Defence Minister: ++INCLUDES MULTIPLE CAMERA ANGLES++
"For a few months now, the deal that was signed in Vienna to keep Iran's nuclear activities in check, has been undermined. Because exactly a year ago, the U.S. decided to pull out from this deal and not respect it. This is why a certain number of sanctions have been put in place by the Americans towards Iran. This part of the politics is the U.S. ascertaining power. Today, nothing would be worse than Iran leaving this deal. But us Europeans who were supporting this deal, us France, we absolutely want to keep this agreement alive and that is why we took a certain number of initiatives. For example to allow commercial transactions that are in large part under U.S. embargo, to allow those commercial transactions to still take place because nothing could be worse than to jeopardise Iran's economy, that is absolutely not our objective. Our objective is that Iran's nuclear production is in check as per the Vienna deal."
3. SOUNDBITE (French) Jean-Jacques Bourdin, journalist:
"Yes, except Iran wants to subtract itself from parts of this deal. That's the information that dropped yesterday, you know this?"
4. SOUNDBITE (French) Florence Parly, French Defence Minister: ++INCLUDES MULTIPLE CAMERA ANGLES++
"It's information, a comment made by the foreign affairs minister, if I am correct. It seems to me that it's also in response to affirmation of the Pre(sident….)"
5. SOUNDBITE (French) Jean-Jacques Bourdin, journalist: ++INCLUDES MULTIPLE CAMERA ANGLES++
"If Iran pulls out from this deal or part of this deal, are European sanctions going to be put in place this time?"
6. SOUNDBITE (French) Florence Parly, French Defence Minister: ++INCLUDES MULTIPLE CAMERA ANGLES++
"It will probably be part of the things that will be examined, there are no sanctions from Europe today because Iran so far always respected its commitment (to the deal) of control and checks of its nuclear installations. So if those commitments weren't respected, of course this question would be raised."
STORYLINE:
French Defence Minister Florence Parly said on Wednesday that nothing would be worse than Iran withdrawing from the 2015 nuclear accord.
Iran announced Tuesday it was partially withdrawing from its deal with world powers, exactly a year after the accord was abandoned by U.S. President Donald Trump.
The 2015 deal saw sanctions on Iran lifted in exchange for limits on its nuclear program. The U.S. has restored crippling sanctions since withdrawing.
During an interview on French television, Parly said if Iran failed to comply with commitments, sanctions would "probably be part of the things that will be examined" by European leaders.
But Parly said France had continued to allow commercial transactions "because nothing could be worse than to jeopardise Iran's economy, that is absolutely not our objective".
Iran notified Britain, Russia, China, the European Union, France and Germany of its decision earlier Wednesday.
All were signatories to the nuclear deal and continue to support it.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.