ఎట్టకేలకు అమెరికా ఆంక్షల ఒత్తిడికి ఇరాన్ తలొగ్గింది. అగ్రరాజ్యంతో చర్చలకు సిద్ధంగా ఉన్నట్టు ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ సంకేతాలిచ్చారు. ఒత్తిడి పెంచే చర్యలను తక్షణమే ఆపాలని అగ్రరాజ్యానికి సూచించారు.
అణుఒప్పందంపై కొంతకాలంగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై కఠిన ఆంక్షలను విధిస్తూ వచ్చింది అగ్రరాజ్యం. ఫలితంగా ఇరాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదంలో పడింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్- రౌహానీ మధ్య మాటల యుద్ధమూ నడిచింది.
సౌదీ చమురు కేంద్రాలపై జరిగిన డ్రోన్ దాడితో ఇరాన్- అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. దాడి పని ఇరాన్‌దేనని అగ్రరాజ్యం పదేపదే ఆరోపించింది.
అమెరికాతో చర్చలకు సానుకూలంగా స్పందించిన రౌహానీ.. సౌదీ చమురు కర్మాగారాలపై దాడితో.. తమకు సంబంధం లేదని పునరుద్ఘాటించారు. ఆరోపణలు చేసేవారు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి:- అమెరికాలో ఇరాన్ అధ్యక్షుడితో మోదీ సమావేశం