ETV Bharat / international

కరోనా బారిన ఇరాన్ ఆరోగ్య మంత్రి - ఇరాన్​ సహాయ ఆరోగ్య మంత్రి

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా ఇస్లామిక్​ దేశాల్లోనూ విజృంభిస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్​ మంత్రికి కూడా కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ మేరకు ఓ అధికారి ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15మంది మృతి చెందగా.. 95మంది వ్యాధి బారిన పడినట్లు పేర్కొన్నారు.

Iran deputy health minister has coronavirus: adviser
కరోనా బారిన ఇరాన్ సహయక ఆరోగ్య మంత్రి
author img

By

Published : Feb 25, 2020, 9:51 PM IST

Updated : Mar 2, 2020, 2:01 PM IST

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ ఇస్లామిక్​ దేశాలనూ గడగడలాడిస్తోంది. ఇరాన్​ ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిన.. ఆరోగ్యశాఖ సహాయమంత్రికే కొవిడ్​-19 సోకినట్లు వైద్యులు నిర్ధరించారు. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు ప్రకటన విడుదల చేశారు.

ముగ్గురు మృతి... 34మందికి వైరస్​

ఇరాన్​లో తాజాగా వైరస్​తో ముగ్గురు మరణించగా, మరొ 34మందికి కరోనా​ సోకింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 15మంది మృతి చెందగా, 95మంది వ్యాధిబారిన పడ్డారని వెల్లడించింది.

దేశంలో అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరిస్తోందని, ప్రతి ప్రాంతం నుంచి కొత్త కేసులు నమోదవుతున్నాయని ఇరాన్​ ఆరోగ్య మంత్రి వెల్లడించారు.

ఇదీ చూడండి: 80వేలు దాటిన కరోనా కేసులు- దక్షిణ కొరియాలో విజృంభణ

Last Updated : Mar 2, 2020, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.