ETV Bharat / international

'ఇరాన్​.. యురేనియం ఉత్పత్తి చేస్తోంది'

ఇరాన్​.. యురేనియం లోహాన్ని ఉత్పత్తి చేస్తోందని ఐరాసకు చెందిన అటామిక్​ ఎనర్జీ ఏజెన్సీ ప్రకటించింది. ఈ విషయాన్ని తమ అధికారులు ధ్రువీకరించినట్టు వెల్లడించింది. ఫలితంగా ఇరాన్​ తన​ చర్యలు 2015 అణు ఒప్పందానికి తూట్లుపొడిచినట్టు అయ్యింది.

author img

By

Published : Feb 11, 2021, 8:39 AM IST

IAEA: Iran has started producing uranium metal
'ఇరాన్​.. యురేనియం ఉత్పత్తి చేస్తోంది'

2015 అణు ఒప్పందానికి తూట్లుపొడుస్తూ.. యురేనియం ఉత్పత్తిని ప్రారంభించింది ఇరాన్​. ఈ విషయాన్ని ఐరాసకు చెందిన ఇంటర్నెషనల్​ అటామిక్​ ఎనర్జీ ఏజెన్సీ(ఐఏఈఏ) ప్రకటించింది.

3.6 గ్రాముల యురేనియం.. ఇరాన్​లోని ఇస్ఫహాన్​ ప్లాంటులో ఉత్పత్తి అయినట్టు ఐరాస సభ్య దేశాలకు వెల్లడించారు ఐఏఈఏ అధిపతి రఫేల్​ గ్రాస్సి. తమ అధికారులు ఈ విషయాన్ని ఈ నెల 8న ధ్రువీకరించినట్టు పేర్కొన్నారు.

ఒప్పందానికి తూట్లు..

యురేనియంపై పరిశోధనలు చేయబోమని 2015లో అణు ఒప్పందంపై సంతకం చేసింది ఇరాన్​. అమెరికా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్​, రష్యా దేశాలు ఈ జాయింట్​ కాంప్రిహెన్సివ్​ ప్లాన్​ ఆఫ్​ యాక్షన్​లో భాగస్వాములుగా ఉన్నాయి. అణుబాంబు తయారీలో దీనిని ఉపయోగించే అవకాశం ఉండటం వల్లే.. ఇరాన్​ చర్యలను నిషేధించడానికి ఈ ఒప్పందాన్ని ప్రతిపాదించాయి ప్రపంచ దేశాలు.

అయితే 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. అదే సమయంలో ఇరాన్​పై భారీ స్థాయిలో ఆంక్షలు విధించింది. ఆ దెబ్బకు ఇరాన్​ అతలాకుతలమైంది.

ఈ నేపథ్యంలో అమెరికా లేనప్పటికీ.. ఒప్పందం విషయంలో ఇరాన్​పై ఒత్తిడి పెంచేందుకు ఇతర దేశాలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ ఒప్పందాన్ని ఇరాన్​ ఎప్పటికప్పుడు ఉల్లంఘిస్తూనే ఉంది. అమెరికా ఆంక్షల నుంచి ఉపశమనం కలిగించే విధంగా తమకు సహాయం చేస్తేనే ఒప్పందాన్ని అంగీకరిస్తామని తేల్చిచెప్పింది.

అయితే అణు ఒప్పందంలో తిరిగి చేరేందుకు అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్​ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఈ తరుణంలో యూరేనియం ఉత్పత్తికి సంబంధించిన వార్త బయటకు రావడం.. ఒప్పందంపై మరింత ప్రభావం చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇదీ చూడండి: న్యూజిలాండ్​, ఇండోనేసియాల్లో భూకంపాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.