ఇప్పుడు మీరు చూడబోయేది ఖరీదైన ఐస్ క్రీం. ఏంటి దీని ప్రత్యేకత అనుకుంటున్నారా? ఏకంగా బంగారంతో తయారైంది మరి.! 'బ్లాక్ డైమండ్'గా పిలుస్తున్న ఈ ఐస్క్రీంను 'ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన' ఐస్ క్రీంగా చెబుతున్నారు. 'షెనాజ్ ట్రెజరీ' అనే ట్రావెల్ వ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
దుబాయ్‌లోని 'స్కూపీ కేఫ్' తయారు చేసిన ఈ ఐస్క్రీంను తినదగిన బంగారంతో అలంకరించారు. దీనితో పాటు తాజా వెనీలా బీన్స్, కుంకుమ పువ్వు, బ్లాక్ ట్రఫుల్స్ ఉపయోగించి ఈ డిజర్ట్(ఐస్‌క్రీం)ను తయారు చేశారు. దీని ధర ఏకంగా రూ.60 వేలు.
రెండు రోజుల క్రితమే పోస్ట్ చేసిన ఈ వీడియో 2 లక్షల వ్యూస్‌ని సొంతం చేసుకుంది. అంతేగాక దీనిపై సరదా కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
'వావ్.. మీరు జీవితంలో ప్రతిదాన్నీ బాగా ఆస్వాదిస్తున్నారు' కదా అని ఒకరు కామెంట్ చేశారు. 'ఐ రియల్లీ లవ్ దిస్ ఐస్‌క్రీం' అంటూ మరొకరు వ్యాఖ్యానించారు. 'ఐస్‌క్రీమ్‌తో పాటు చెంచా, గిన్నె కూడా ఫ్రీగా వస్తాయా? అంటే మీరు వాటిని ఇంటికి తీసుకెళ్లొచ్చా' అని మరొకరు చమత్కరించారు. దీనికి స్పందించిన ఆమె అవును అంటూ సమాధానమిచ్చింది.
ఇవీ చదవండి: