ప్రపంచంలోని అతిపెద్ద పోర్టులలో ఒకటైన దుబాయ్ జెబెల్ అలీ పోర్టులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో కంటైనర్ ఓడలో భారీగా మంటలు చెలరేగి పేలుడు సంభవించింది. ఈ క్రమంలో పెద్ద శబ్దాలు రావడం వల్ల స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.
అయితే.. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం తెల్లవారుజామునకు మంటలు పూర్తిగా అదుపు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. పోర్ట్ ప్రాంతంలో ఎంత మేరకు ఆస్తి నష్టం జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే.. పేలుడు కారణంగా పోర్టు సమీపంలోని భవనాలు కంపించినట్లు స్థానికులు చెబుతున్నారు. పోర్టుకు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొందరు స్థానికులు 11.30 గంటలకు పేలుడు శబ్దాలు వినిపించినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:దుబాయ్ వెళ్లేందుకు భారత ప్రయాణికులకు అనుమతి, కానీ!