ఈజిప్టు రాజధాని కైరోలోని ఓ బాలల నిర్బంధ గృహంలో మంటలు చెలరేగి ఆరుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో 24మందికి పైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు.
అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. దానికి ముందు ఇద్దరు పిల్లల మధ్య గొడవ జరిగినట్టు వివరించారు. వార్డుకు తాళం వేసి ఉండటం వల్ల మంటల నుంచి చిన్నారులు తప్పించుకోలేకపోయారని స్థానిక మీడియో పేర్కొంది. ఈ వ్యవహారంపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: వస్త్ర దుకాణంలో అగ్నిప్రమాదం-20మంది మృతి