ETV Bharat / international

టర్కీలో భూకంపం- రిక్టర్​ స్కేలుపై 5.3 తీవ్రత

author img

By

Published : Dec 27, 2020, 6:55 PM IST

టర్కీలో భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేలుపై 5.3 తీవ్రత నమోదైంది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ మంత్రి వెల్లడించారు.

Eastern Turkey shook by 5.3 magnitude earthquake
5.3 తీవ్రతతో కంపించిన భూమి

ఉత్తర టర్కీలోని ఎలాజిగ్​​​ రాష్ట్రంలో భూమి కంపించింది. రిక్టర్​ స్కేలుపై తీవ్రత 5.3గా నమోదైంది. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి సులేమాన్​ సోయ్లు తెలిపారు. ఆదివారం ఉదయం 9 గంటల తరువాత భూకంపం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఎలాజిగ్​ పక్క రాష్ట్రాలలో కూడా స్వల్పంగా భూమికంపించినట్లు తెలిపారు.

టర్కీలో భూకంపాలు తరచుగా వస్తుంటాయి. జనవరిలో​ రిక్టర్​ స్కేలుపై 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపంలో ఎలాజిగ్​​, మలాతియా రాష్ట్రాలలో41 మంది మృతి చెందారు. ఇజ్మీర్​​ పట్టణంలో అక్టోబర్​లో వచ్చిన భూకంపంలో 116 మంది మృత్యువాత పడ్డారు.

ఇదీ చూడండి: టర్కీలో భూకంపం- 5.0 తీవ్రత నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.