యూఏఈలో నివాసముంటున్న ఓ భారతీయుడు భారీ గ్రీటింగ్ కార్డు నెలకొల్పారు. యూఏఈ పాలకుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ అధికారాన్ని చేపట్టి 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. 8.2 చదరపు మీటర్ల భారీ గ్రీటింగ్ కార్డును చెన్నైకి చెందిన రాంకుమార్ సారంగపాణి రూపొందించి, ఆవిష్కరించినట్లు దుబాయ్ మీడియా శనివారం వెల్లిడించింది. దీనిని షేక్ మహమ్మద్‌కు అంకితమిచ్చినట్లు తెలిపింది. తాజా రికార్డుతో రాంకుమార్ ఖాతాలో 19 రికార్డులు చేరాయి.
-
Ramkumar Sarangapani (UAE) had a busy #GWRDay - setting SIX new records!
— Guinness World Records 2021 Out Now (@GWR) November 19, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
His records include the largest magnet sentence and the smallest pack of cards... 🃏 pic.twitter.com/XDDLWDszJf
">Ramkumar Sarangapani (UAE) had a busy #GWRDay - setting SIX new records!
— Guinness World Records 2021 Out Now (@GWR) November 19, 2020
His records include the largest magnet sentence and the smallest pack of cards... 🃏 pic.twitter.com/XDDLWDszJfRamkumar Sarangapani (UAE) had a busy #GWRDay - setting SIX new records!
— Guinness World Records 2021 Out Now (@GWR) November 19, 2020
His records include the largest magnet sentence and the smallest pack of cards... 🃏 pic.twitter.com/XDDLWDszJf
యూఏఈ, భారత్‌ల్లో అత్యధిక గిన్నిస్ రికార్డులు నమోదు చేసిన వ్యక్తిగా రాంకుమార్ నిలిచినట్లు ఇక్కడి మీడియా వివరించింది. ఈ కార్డులో దుబాయ్ చిత్రకారుడు అక్బర్ సాహెబ్ గీసిన.. షేక్ మొహమ్మద్ చిత్రాలున్నట్లు పేర్కొంది. సాధారణ కార్డు కన్నా 100 రెట్లు పెద్దదిగా ఉన్నట్లు వివరించింది. గతంలో 6.729 చదరపు మీటర్ల గ్రీటింగ్ కార్డు నెలకొల్పగా రాంకుమార్ తాజాగా దానిని అధిగమించారు. 'ఆరు నెలలు శ్రమించి ఈ కార్డును రూపొందించాను. యూఏఈ 50వ జాతీయ దినోత్సవం సందర్భంగా దీనిని దేశానికి అంకితమిస్తున్నాను' అని రాంకుమార్ తెలిపారు.