సౌదీ అరేబియాలోని అభా విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడులు(saudi drone attack) జరిగాయి. ఈ ఘటనలో ఓ విమానం పాక్షికంగా ధ్వంసం కాగా.. ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారని స్థానిక మీడియా తెలిపింది.
సోమవారం నుంచి ఈ ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన రెండో దాడి(abha airport attack) ఇది. ఈ దాడికి ఇంతవరకు ఎవరూ బాధ్యత ప్రకటించుకోలేదు. ఇదివరకు జరిగిన దాడికి.. ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌లోని షియా హౌతీ రెబల్స్(houthi rebels attack) కారణమని తెలుస్తోంది. సరిహద్దు దేశమైన యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులపై.. సౌదీ అరేబియా భీకర యుద్ధం చేస్తున్న నేపథ్యంలో వరుస దాడులు జరగడం గమనార్హం.
ఈ ఘటనపై సౌదీ సైన్యం స్పందించలేదు. పేలుడు పదార్థాలు కలిగిన ఓ డ్రోన్‌ను అడ్డుకున్నట్లు చెప్పడం మినహా... దీనిపై వివరాలు వెల్లడించలేదు.
యుద్ధం వెనుక కథ!
2014లో యెమెన్ యుద్ధం(saudi yemen war) ప్రారంభమైంది. ఆ ఏడాది.. హౌతీ తిరుగుబాటుదారులు యెమెన్ రాజధాని సనాతో పాటు దేశంలోని చాలా వరకు భూభాగాన్ని తమ హస్తగతం చేసుకున్నారు. సౌదీ నేతృత్వంలోని కూటమి సైన్యం.. హౌతీ రెబల్స్‌ను గద్దెదించి, అంతర్జాతీయ ఆమోదం కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య యుద్ధం జరుగుతోంది. సౌదీలోని కీలక ఎయిర్‌పోర్ట్‌లను లక్ష్యంగా చేసుకొని తిరుగుబాటుదారులు దాడులకు తెగబడుతున్నారు.
ఇదీ చదవండి: