మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించడాన్ని చైనా నాలుగోసారి అడ్డుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మార్చి 27న ఇదే అంశంపై ఐరాసలోని 15 దేశాలకు అమెరికా తీర్మాణం అందించింది. మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించి వెంటనే అతని ఆస్థులు జప్తులు చేయాలని కోరింది.
ఉగ్రవాద సంస్థలకు చైనా అండగా నిలుస్తోందన్న అమెరికా ఆరోపణలను డ్రాగన్ ఖండించింది. మసూద్ అజార్ విషయంపై అనేక దేశాలతో చర్చలు జరుపుతూ పురోగతి సాధిస్తున్న విషయం అగ్రరాజ్యానికీ తెలుసని స్పష్టం చేసింది.