ETV Bharat / international

ఇజ్రాయెల్​కు బైడెన్​ మద్దతు.. గాజాలో మరణాలపై ఆందోళన - బైడెన్​

గాజాలోని విదేశీ మీడియా భవనంపై ఇజ్రాయెల్ బలగాలు దాడి చేసిన అనంతరం ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుతో ఫోన్​లో మాట్లాడారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. గాజాలోని పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మెుహమ్మద్‌ అబ్బాస్‌.. ఈ ఘర్షణల్లో అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు.

Biden, Netanyahu
బైడెన్, నెతన్యాహు
author img

By

Published : May 16, 2021, 5:37 AM IST

Updated : May 16, 2021, 6:40 AM IST

ఇజ్రాయెల్​ బలగాలు, పాలస్తీలోని హమాస్​ ఉగ్రవాదుల మధ్య పోరు కొనసాగుతోంది. ఈ క్రమంలో గాజాలోని హమాస్​ ఉగ్రవాద అగ్రనేత ఖలీల్​ అల్​ హయెహ్​ ఇంటిపై బాంబు దాడి చేసినట్లు ఇజ్రాయెల్​ బలగాలు తెలిపాయి. ఉగ్రవాదులకు మౌలిక వసతులు కల్పించేందుకు ఆ ఇల్లు ఉపయోగపడుతోందని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది.

ఇజ్రాయెల్ ప్రధానికి బైడెన్​ ఫోన్​

అంతకుముందు గాజా నగరంలోని మీడియా భవనంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటన అనంతరం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​.. ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుతో ఫోన్​లో మాట్లాడారు. గాజాలోని పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఇజ్రాయెల్​కు గట్టి మద్దతు తెలిపిన బైడెన్​.. గాజాలోని అమాయక ప్రజల మరణాలు, పాత్రికేయుల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు జరుగుతున్న ఘర్షణలకు ఇజ్రాయెల్​ తీసుకుంటున్న చర్యల గురించి బైడెన్​కు వివరించారు నెతన్యాహు. తమకు మద్దతుగా ఉన్నందుకు అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు ఇజ్రాయెల్​ ప్రధాని.

బైడెన్​కు పాలస్తీనా అధ్యక్షుడు ఫోన్​

బైడెన్​తో పాలస్తీనా అధ్యక్షుడు మొహమ్మద్​ అబ్బాస్​ ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయెల్​ దాడులను అడ్డుకునేందుకు అమెరికా జోక్యం చేసుకోవాలని కోరారు. పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్​ దాడులకు స్వస్తి పలికేలా చర్చలు జరపాలని బైడెన్​కు విజ్ఞప్తి చేశారు. పాలస్తీనాలో శాంతి కోసం అంతర్జాతీయ మధ్యవర్తులతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

విరమించండి

హమాస్​ ఉన్నతాధికారి ఇస్మాయిల్ హనియా.. ఖతార్​ విదేశాంగ మంత్రి షేక్​ మొహమ్మద్​ బిన్​ అబ్దుల్‌రహ్మాన్ అల్​ను దాహోలో కలిసినట్లు ఖతార్​ విదేశాంగశాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ దాడులను ఆపడానికి అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు హమాస్​ నేత. మరోవైపు దాడులు విరమించుకోవాలని ఇరు వర్గాలకు ఈజిప్ట్​, సౌదీ అరేబియా దేశాలు విజ్ఞప్తి చేశాయి.

ఇదీ చూడండి: గాజాలోని మీడియా భవనంపై ఇజ్రాయెల్‌ దాడి

Last Updated : May 16, 2021, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.