ETV Bharat / international

కాబుల్​లోకి తాలిబన్లు- అతి త్వరలో అధికార బదిలీ! - america troops in afghanistan

taliban
కాబుల్​లోకి తాలిబన్లు
author img

By

Published : Aug 15, 2021, 1:32 PM IST

Updated : Aug 15, 2021, 5:26 PM IST

13:24 August 15

కాబుల్​లోకి తాలిబన్లు- అఫ్గాన్​ పూర్తిగా వారి వశం!

అతికొద్ది రోజుల్లోనే అఫ్గానిస్థాన్​లోని కీలక నగరాలను హస్తగతం చేసుకున్న తాలిబన్లు.. ఆదివారం రాజధాని కాబుల్​లోకి ప్రవేశించారు. ప్రభుత్వంతో 'అధికార బదిలీ' అంశాన్ని చర్చించేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా.. ఆ దేశ అధ్యక్ష కార్యాలయానికి తాలిబన్​ ప్రతినిధులు వెళ్తున్నారని అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి.  

కాబుల్​ నగరాన్ని శాంతియుతంగా స్వాధీనం చేసుకోవడానికి తాము ఎదురు చూస్తున్నామని తాలిబన్ ప్రతినిధి సుహైల్​ షహీన్​ తెలిపారు. అయితే.. ఈ మేరకు అఫ్గాన్​ ప్రభుత్వానికి, తమకు మధ్య ఏమైనా చర్చలు జరిగాయన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.  

"ఏ ఒక్కరి ప్రాణాలు, ఆస్తులు, గౌరవానికి హాని కలగదు. కాబుల్​ ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడవేయం."  

-తాలిబన్లు.  

ఆ జిల్లాలు ముష్కరుల వశం..

అంతకుముందు... కాబుల్​ శివార్లలోని కలాకన్, ఖారాబాఘ్​, పఘ్​మన్​ జిల్లాలు ఇప్పటికే ముష్కరుల వశమైనట్లు అఫ్గానిస్థాన్ ప్రభుత్వాధికారులు ముగ్గురు అంతర్జాతీయ మీడియాకు వెల్లడించారు. మరోవైపు.. బాగ్రామ్ ఎయిర్​ బేస్​నూ అఫ్గాన్ బలగాలు.. తాలిబన్లకు అప్పగించాయి. 

అఫ్గాన్​లో నెలకొన్న అనిశ్చితి మధ్య.. అనేక మంది ప్రభుత్వ అధికారులు తమ కార్యాలయాల్ని వీడి వెళ్లారు.

తాము ప్రజల ప్రాణాలకు హాని కలిగించే చర్యలు చేపట్టబోమని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. అఫ్గాన్​ ప్రజల్లో భయాలు వీడటం లేదు. విదేశాలకు తరలి వెళ్లేందుకు చాలా మంది కాబుల్​ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. 

కీలక పత్రాలను నాశనం చేసి..!

ఆదివారం అమెరికా రాయబార కార్యాలయం సమీపంలో.. హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు ఎగురుతూ కనిపించాయి. కార్యాలయానికి చెందిన వాహనాలు ఆ ప్రాంతాన్ని వీడుతున్న దృశ్యాలు కనిపించాయి.  

అయితే.. అఫ్గాన్​ వీడి వెళ్లటంపై అమెరికా విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు. అదే సమయంలో.. అమెరికా రాయబార కార్యాలయం వద్ద పొగ వెలువడుతున్నట్లు కనిపించింది. అమెరికా రాయబారులు.. సున్నితమైన అంశాలకు సంబంధించిన కీలక పత్రాలను నాశనం చేశారని ఇద్దరు అమెరికా సైనికాధికారులు తెలిపారు. ఈ ప్రాంతంతో పాటు ఇతర దేశాల రాయబారులు ఉన్న కార్యాలయాల వద్ద కూడా పొగ కనిపించింది.  

ఎలాంటి ఘర్షణకు దిగకుండానే..  

అఫ్గాన్​లోని కీలక నగరం జలాలాబాద్​ను ఆదివారం తెల్లవారు జామున ఆక్రమించారు తాలిబన్లు. దీంతో తూర్పు ప్రాంతానికి, దేశ రాజధాని కాబుల్​కు మధ్య సంబంధాలు తెగిపోయాయి. జలాలాబాద్​ నగరంలోని గవర్నర్​ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్న వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేశారు తాలిబన్లు. వారితో ఎలాంటి ఘర్షణకు దిగకుండానే.. భద్రతా దళాలు లొంగిపోయినట్లు ఓ అధికారి తెలిపారు.  

అంచనాలను తలకిందులు చేస్తూ..

అఫ్గాన్​లో​ సైనిక శిక్షణ కోసం ఎన్నో ఏళ్లుగా.. వందల కోట్లను అమెరికా ఖర్చు చేస్తున్నప్పటికీ.. ఆ దేశ ​ బలగాలు తాలిబన్లకు అంత త్వరగా ఎందుకు తలొగ్గాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అఫ్గాన్​ రాజధానిని తాలిబన్లు ఆక్రమించుకోవడానికి నెలరోజుల సమయం పట్టే అవకాశముందని అమెరికాకు సైన్యం ఇటీవల అంచనా వేసింది. అయితే.. ఆ అంచనాలను  తలకిందులు చేస్తూ.. అతికొద్ది రోజుల్లోనే తాలిబన్ల చేతుల్లోకి అఫ్గాన్​ వెళ్లిపోయింది.  

Last Updated : Aug 15, 2021, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.