ఇరాక్ పశ్చిమ ప్రాంతంలో జరిగిన బాంబు దాడిలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో భద్రతా సిబ్బంది ఆరుగురు ఉండగా.. ఓ స్థానికుడు మరణించినట్లు ఆ దేశ మీడియా వర్గాలు తెలిపాయి. మరో ఇద్దరికి గాయాలైనట్లు వెల్లడించాయి. ఈ పేలుడు నినెవెహ్ రాజధాని మోసుల్కు 100 కి.మీ దూరంలోని గ్రామంలో జరిగింది.
దీని వెనుక ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఉన్నట్లు భావిస్తున్నారు. గతంలో ఈ ప్రాంతం వారి అధీనంలోనే ఉండేది.