రష్యా వైమానిక దళాలు.. వాయవ్య సిరియాపై దాడులు చేశాయి. ఈ దాడిలో 11 మంది మృతి చెందినట్లు సిరియా మానవహక్కుల పర్యవేక్షణ సంస్థ తెలిపింది. సిరియా ప్రభుత్వ దళాలు తిరిగి నగరంలో ప్రవేశించటం వల్ల వారికి మద్దతుగా ఈ దాడి జరినట్లు సమాచారం.
డమాస్కస్-అలెప్పో హైవేపై ఉన్న సారాకేబ్ పట్టణంపై రష్యా వైమానిక దళాలు పూర్తి నియంత్రణను తిరిగి సాంధించినట్లు సిరియా మానవహక్కుల పర్యవేక్షణ సంస్థ వెల్లడించింది. దాడుల్లో ఇడ్లిబ్ ప్రావిన్స్‌లోని అల్-ఫౌవా గ్రామంలో తొమ్మిది మంది, అద్వాన్లో ఇద్దరు మృతి మృతి చెందారు.
అలాగే సోమవారం జరిగిన దాడుల్లో 21 మంది తిరుగుబాటుదారులు, జిహాదీలు, 11 మంది ప్రభుత్వ దళాలు మరణించినట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:చైనాలో 2,943కు చేరుకున్న కరోనా మృతులు