ETV Bharat / international

World Culture Festival 2023 : 180 దేశాలు.. 17వేల మంది కళాకారులు.. వేలాది మందితో యోగా.. ఘనంగా ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు - ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు 2023

World Culture Festival 2023 : అమెరికాలోని వాషింగ్టన్‌లో ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. రెండో రోజూ ఎంతో ఉత్సాహంగా సాగాయి. ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ నేతృత్వంలో వేలాది మంది రెండో రోజు యోగా, మెడిటేషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 80దేశాల నుంచి వచ్చిన 17 వేల మంది కళాకారులు.. అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. వివిధ దేశాల ప్రముఖులు వచ్చి తమ సందేశం వినిపించారు.

world culture festival 2023
world culture festival 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 4:32 PM IST

Updated : Oct 1, 2023, 4:56 PM IST

World Culture Festival 2023 : ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో 180 దేశాల నుంచి 17 వేల మంది కళాకారులు పాల్గొంటున్నారు. రెండో రోజూ సాంస్కృతిక ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. లింకన్ సెంటర్ వద్ద ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ నేతృత్వంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. మారిషస్‌ అధ్యక్షుడు పృథ్వీరాజ్‌సింగ్‌ రూపన్‌, యూఎస్‌ సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తి, ట్యునీషియా మాజీ అధ్యక్షుడు మోన్‌సెఫ్‌ మార్జౌకీ తదితరులు తమ సందేశం వినిపించారు.

  • Gurudev @SriSri led a yoga and meditation session for thousands of participants at the National Mall in Washington DC, on the second day of the World Culture Festival. pic.twitter.com/WkWJ01vy0i

    — The Art of Living (@ArtofLiving) September 30, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

రెండో రోజు ప్రఖ్యాత కళాకారుల సంగీతం, నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అమెరికా ఆర్మీ బ్యాండ్‌, చైనీస్‌ కల్చరల్ ఆర్టిస్టులు, గార్బా నృత్యాలు, పశ్చిమ దేశాల నృత్యాలు, ఉక్రెయిన్‌ కళాకారుల ప్రదర్శన అలరించాయి. ప్రపంచ సాంస్కృతిక వేడుకల్లో రెండో రోజున ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌ వీక్షకులతో మెడిటేషన్ చేశారు.ఈ సందర్భంగా మెడిటేషన్ ఆవశ్యకతను ఆయన వివరించారు. ఈ సందర్భంగా జయహో నినాదాలతో వాషింగ్టన్ డీసీ ప్రాంతం మార్మోగిపోయింది.

"శబ్దం తన సంగీతంతో విస్తరిస్తుంది. కదలికలు ఒక పద్ధతిలో విస్తరించి నృత్యంగా మారతాయి. మెడిటేషన్‌తోనే మనసు విస్తరిస్తుంది. సంబరాలతోనే జీవితం విస్తరిస్తుంది. అన్ని రకాల శబ్దం అంతరంగంలో నిశ్శబ్దాన్ని సృష్టిస్తుంది. నిశ్శబ్దం సృజనాత్మకతకు అమ్మలాంటిది. అది ప్రేమ, కరుణతో నిండిన ఇల్లు వంటిది. మనలోని నిశ్శబ్దం నిజమైన ఆనందం, సంతోషం, ప్రేమను వికసింపజేస్తుంది. కాబట్టి కొన్ని నిమిషాలు మెడిటేషన్ చేద్దాం. మెడిటేషన్‌ అనేది ఏ ప్రయత్నమూ లేకుండా చేసేది. దానికి ప్రయత్నం అవసరమే లేదు.

--శ్రీశ్రీ రవిశంకర్‌, ఆర్ట్‌ ఆఫ్ లివింగ్‌ వ్యవస్థాపకులు

'వివేకానందుని ప్రసంగాన్ని గుర్తుకు తెచ్చాయి'
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రెండో రోజు ఉత్సవాలకు హాజరయ్యారు. ప్రపంచ సర్వమత మహా సభల్లో స్వామి వివేకానంద చేసిన ప్రసంగాన్ని... ప్రపంచ సాంస్కృతిక వేడుకలు గుర్తుకు తెచ్చాయని ఆయన చెప్పారు. ప్రపంచంలోని వివిధ సంస్కృతుల ప్రజలను.. ఒకే వేదికపైకి తీసుకువచ్చినందుకు ఆర్ట్ ఆఫ్ లివింగ్​ సంస్థను అభినందించారు. ఆదివారం ఆయన పుట్టినరోజు కావడం వల్ల.. సభావేదికపైనే జన్మదిన వేడుకలు నిర్వహించారు.

World Cultural Festival 2023 : 'జీవితం చాలా చిన్నది.. ఘర్షణలు వద్దు.. మనమంతా ఒకే ఫ్యామిలీ'

Art Of Living World Culture Festival 2023 : ఘనంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్​ వరల్డ్ కల్చర్ ఫెస్టివల్​.. పది లక్షల మంది హాజరు

Last Updated : Oct 1, 2023, 4:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.