ETV Bharat / international

'ఇంటింటా 'ఆమె' కష్టమే.. పురుషుల కంటే మహిళలదే ఎక్కువ శ్రమ'

కుటుంబాల్లో, ఇళ్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా శ్రమిస్తున్నారని.. వారిపైనే పనిభారం అధికంగా ఉంటోందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. మహిళలు, పురుషులు వివాహబంధంలోకి వెళ్లిన అనంతరం 4 రకాల జీవన విధానాలను కొనసాగిస్తున్నట్లు లండన్​ పరిశోధకులు తెలిపారు.

author img

By

Published : Jan 11, 2023, 7:14 AM IST

Etv women-do-more-work-than-men-in-family-study-by-lanzhou-university-china
Etv కుటుంబంలో పురుషుల కంటే ఎక్కువ శ్రమిస్తున్న మహిళలు

ప్రపంచవ్యాప్తంగా కుటుంబ జీవనపథంలో ఎందరో ప్రజలు నిత్యం సమయాన్ని, శక్తిని వెచ్చిస్తూ శారీరక శ్రమ చేస్తుంటారు. అయితే కుటుంబాల్లో, ఇళ్లలో పురుషుల కంటే మహిళలే ఎక్కువగా శ్రమిస్తున్నారని, వారిపైనే పనిభారం అధికంగా ఉంటోందని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. చైనాలోని లాన్‌ఝౌ విశ్వవిద్యాలయం సహకారంతో యూనివర్సిటీ కాలేజ్‌ లండన్‌ పరిశోధకులు చేపట్టిన ఈ అధ్యయన వివరాలు 'కరెంట్‌ బయాలజీ'లో ప్రచురితం అయ్యాయి. మహిళలు, పురుషులు వివాహబంధంలోకి వెళ్లిన అనంతరం 4 రకాల జీవన విధానాలను కొనసాగిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

సాధారణంగా మహిళలు తమ పుట్టింటిని వదిలి అత్తవారింటికి వెళుతుండగా.. పురుషులు మాత్రం తమ కుటుంబీకులతోనే నివసిస్తుంటారు. దీన్నే పితృస్వామ్యంగా పిలుస్తుంటాం. 'నియోలొకాలిటీ'గా పిలిచే మరో జీవనవిధానంలో స్త్రీ, పురుషులిద్దరూ తమ పుట్టిళ్లను వదిలేసి కొత్త ప్రాంతంలో జీవనం సాగిస్తుంటారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఈ విధానం కూడా కొనసాగుతోంది.

'మ్యాట్రిలొకాలిటీ' అనే అరుదైన విధానంలో మహిళలు తమ పుట్టింటిలోనే ఉండగా.. పురుషులు తమ కుటుంబాల్ని వదిలి అత్తవారింటికి వెళుతుంటారు. అత్యంత అరుదైన మరో విధానం(డుయోలొకాలిటీ)లో వివాహబంధంతో ఏకమైనప్పటికీ భార్యాభర్తలు ఎవరి ఇళ్లలో వారే ఉంటారు. ఇలాంటి 4 రకాల వైవిధ్యభరిత జీవన సంస్కృతులూ కలిసి ఉండే ప్రాంతమైన టిబెటెన్‌ సరిహద్దుల్లోని చైనా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అధ్యయనం జరిపారు. ఈ సందర్భంగా భిన్న జీవనవిధానాలను కొనసాగిస్తున్న 500 మందిని కలిశారు.

శ్రమ'బాట'లో..
పురుషుల కంటే మహిళలే ఎక్కువగా కష్టపడుతున్నట్లు అధ్యయనంలో గుర్తించారు. తమ కుటుంబాల కోసం అధికంగా శ్రమిస్తున్నది వారే. ఈమేరకు మహిళలు సగటున రోజుకు 12,000 అడుగులు నడుస్తుంటే, పురుషులు 9,000 అడుగులు నడుస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు.

  • పురుషులు కూడా శ్రమిస్తున్నప్పటికీ మహిళలతో పోలిస్తే వారి కష్టం తక్కువ. మహిళల కంటే వారు సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనే లేదా విరామం తీసుకుంటున్న సమయం ఎక్కువగా ఉంటోంది. ఈ మేరకు వివాహబంధంతో వేరే ఇంటికి వెళ్లే మహిళలు తన పుట్టింటిని విడిచిపెడుతున్న బాధతో పాటు శ్రమపరంగానూ ఎక్కువ భారం మోయాల్సి వస్తోంది.
  • మిగతా వైవాహిక జీవన విధానాల కంటే.. ఇద్దరూ పుట్టిళ్లను వదిలి వేరుగా జీవనం సాగిస్తున్న స్త్రీ, పురుషులపై శ్రమభారం అధికంగా ఉంటోంది. ఇక్కడా మహిళలపైనే పనిఒత్తిడి ఎక్కువగా ఉంటోంది.
  • పురుషులు పుట్టింటిని వదిలి వెళ్లే వివాహవ్యవస్థలో మాత్రమే పనిభారంలో స్త్రీ, పురుష సమానత్వం ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇలాంటిచోట్ల పురుషులు రోజుకు సగటున 2,000 అడుగులు అదనంగా నడవాల్సి వస్తుంటే, మహిళలు 1,000 అడుగులు ఎక్కువగా నడవాల్సి వస్తోంది.
  • ప్రధానంగా పేద, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలపై పనిభారం ఎక్కువగా ఉంటోంది. వ్యవసాయం, పశుపోషణ, ఇంటిపనికి శ్రమ, సమయాన్ని వెచ్చిస్తుండటంతో వారికి విరామసమయం తక్కువగా ఉంటోంది. సంపన్న కుటుంబాలు, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు తక్కువగా ఉంటున్నాయి. దీంతో పట్టణ ప్రాంతాల్లో శారీరకశ్రమ చేసే జీవనవిధానం తగ్గిపోతోంది.
  • పనిభారం విషయంలో ఇంటా బయటా కూడా స్త్రీ, పురుష సమానత్వం లేదని పరిశోధకులు చెబుతున్నారు. భర్తను, కుటుంబాలను వదిలి వేరుగా జీవిస్తున్న మహిళల సంఖ్య కూడా కొంతమేర పెరుగుతున్నట్లు తెలిపారు.
  • ఇవీ చదవండి:
  • బ్రెజిల్‌ రాజధానిలో ఆందోళనకారుల విధ్వంసం.. వెనుక ఉన్నది ఎవరు?
  • బైడెన్​ కార్యాలయంలో రహస్య పత్రాలు.. ఒబామా టైమ్​లోనివే.. అసలేం జరిగింది?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.