ETV Bharat / international

FBI, విద్యాశాఖను రద్దు చేస్తానన్న వివేక్.. తగ్గేదే లేదన్న ట్రంప్! - వివేక్ రామస్వామి అమెరికా

తాను అమెరికా అధ్యక్షుడినైతే విద్యాశాఖ, ఎఫ్​బీఐలను రద్దు చేస్తానని రిపబ్లికన్ పార్టీ నేత వివేక్ రామస్వామి ప్రకటించారు. చైనా నుంచి అమెరికా దూరం జరగాలని అన్నారు. శరీర రంగు ఆధారంగా వ్యక్తుల నేపథ్యంపై అంచనాకు రావడం తప్పని చెప్పారు. మరోవైపు, అధ్యక్ష రేసు నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.

vivek-ramaswamy
vivek-ramaswamy
author img

By

Published : Mar 5, 2023, 8:20 AM IST

రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష బరిలో నిలవాలని భావిస్తున్న భారత సంతతి నేత వివేక్ రామస్వామి సంచలన ప్రకటనలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడినైతే విద్యాశాఖతో పాటు కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ అయిన ఎఫ్​బీఐని రద్దు చేస్తానని ప్రకటించారు. చైనాతో అమెరికా కంపెనీలు వ్యాపారాలు చేయకుండా నిషేధిస్తానని స్పష్టం చేశారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన ఆయన.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి, ఆయన ప్రతిపాదించిన 'అమెరికా ఫస్ట్' అనే విధానం నుంచి తాను స్ఫూర్తి పొందుతున్నట్లు చెప్పుకొచ్చారు. జాతి, లింగం, పర్యావరణం అనే మూడు సెక్యులర్ మతాలు అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఆరోపించారు.

"విద్యా శాఖను రద్దు చేస్తానని గతంలోనే చెప్పా. అది ఎందుకు ఉందో తెలియదు. అసలు ఆ శాఖ ఉండాల్సింది కాదు. నేను రద్దు చేయబోయే రెండో ప్రభుత్వ విభాగం ఎఫ్​బీఐ. దాని స్థానంలో కొత్త సంస్థను ఏర్పాటు చేసే సమయం వచ్చింది. అమెరికాలో భయానక సంస్కృతికి బీజం పడుతోంది. శరీరం రంగు ఆధారంగా ఒకరి నేపథ్యాన్ని గుర్తిస్తున్నారు. నల్లజాతీయులను అందరూ కష్టాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. శరీరం రంగు తెల్లగా ఉంటే.. నీ ఆర్థిక స్తోమతతో సంబంధం లేకుండా నిన్ను గొప్పవాడిగా భావిస్తున్నారు. లింగం అనేది రెండో సెక్యులర్ మతంగా మారిపోయింది. జీవితకాలంలో పలుమార్లు లింగం మారడం అనేది వాస్తవికంగా లేదు. దీన్ని మతంగా పరిగణిస్తేనే సమయోచితంగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనైనా కర్బన ఉద్గారాలు ఆపాలి అంటారు. ఉత్తమ కర్బన రహిత అణు ఇంధనాన్ని వాడకానికి మాత్రం ఒప్పుకోరు. ఇది పర్యావరణ మతం."
-వివేక్ రామస్వామి

అమెరికా గుర్తింపు సంక్షోభంలో పడిందని వివేక్ చెప్పుకొచ్చారు. నూతన అమెరికాను సృష్టించుకునే ముందు.. ప్రస్తుతం అమెరికా అంటే ఏంటనేది కనిపెట్టాలని అన్నారు. అందుకే తాను ఎన్నికల్లో పోటీకి దిగినట్లు చెప్పారు. చైనా నుంచి అమెరికా దూరంగా జరగాలని నొక్కి చెప్పారు. 'చైనా నుంచి మనం స్వాతంత్ర్యం పొందాలి. ఇప్పుడు మనం చేసుకునే స్వాతంత్ర్య తీర్మానం చైనాకు దూరం జరిగేలా ఉండాలి. థామస్ జెఫర్​సన్ బతికి ఉంటే.. అలాంటి స్వాతంత్ర్య తీర్మానాన్నే ఆమోదించేవారు. నేను మీ అధ్యక్షుడిగా ఎన్నికైతే నేను కూడా అదే చేస్తా' అని వివేక్ చెప్పుకొచ్చారు.

తప్పుకోలేదు: ట్రంప్
మూడోసారి అధ్యక్ష పదవికి తప్పక పోటీ చేస్తానని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. తనపై నేరాభియోగాలు మోపినా.. రేసు నుంచి తప్పుకోనని తెలిపారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్​లో మాట్లాడిన ఆయన... పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు అసలు ఆలోచనే చేయలేదని చెప్పారు. తాను మొదలుపెట్టిన పనిని పూర్తి చేయాల్సి ఉందని అన్నారు.

మరోవైపు, రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష ఎన్నికల రేసులో నిలవాలని భావిస్తున్న నిక్కీ హేలీ చైనాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇప్పటివరకు ఎదుర్కొన్న శత్రువులతో పోలిస్తే అత్యంత బలమైన, క్రమశిక్షణ కలిగిన దేశం చైనా అని వ్యాఖ్యానించారు. కొవిడ్ వ్యాప్తిపై డ్రాగన్​ను జవాబుదారీ చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా సరిహద్దులకు భయంకర ఫెన్టానిల్ అనే డ్రగ్​ను పంపుతున్న చైనాను ఎదుర్కోవాలన్నారు. చైనా నిఘా బుడగలు అమెరికా గగనతలంలో చక్కర్లు కొడతాయని తానెప్పుడూ అనుకోలేదని, ఇది చాలా అవమానకరమని నిక్కీ హేలీ ఆందోళన వ్యక్తం చేశారు. చైనా విషయంలో బైడెన్ వ్యవహరిస్తున్న తీరు బాధాకరమన్న హేలీ... చైనా సంస్థలు అమెరికాలో 3లక్షల 80వేల ఎకరాల భూమిని సొంతం చేసుకున్నాయని తెలిపారు. అందులో కొన్ని అమెరికా సైనిక స్థావరాలకు దగ్గరగా ఉన్నాయని నిక్కీ హేలీ ఆందోళన వ్యక్తం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.