ETV Bharat / international

US Spending Bill 2023 : బైడెన్​ ప్రభుత్వానికి తప్పిన 'షట్‌డౌన్‌' ముప్పు.. స్వల్పకాల బిల్లులకు ప్రతినిధుల సభ ఆమోదం

US Spending Bill 2023 : ఎట్టకేలకు స్వల్పకాల బిల్లులకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. దీంతో అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి ఎదురైన షట్‌డౌన్‌ ముప్పు తొలగిపోయింది. స్పీకర్‌ మెకార్థీ చూపిన ప్రత్యేక చొరవ ఇందుకు కారణమైంది.

us-spending-bill-2023-us-house-passes-short-term-spending-bill
అమెరికా ప్రభుత్వ నిధుల బిల్లు 2023
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 1, 2023, 7:54 AM IST

Updated : Oct 1, 2023, 9:27 AM IST

US Spending Bill 2023 : అమెరికా ప్రతినిధుల(దిగువ)సభలో వార్షిక ద్రవ్య వినిమయ బిల్లుల ఆమోదం లభించింది. రిపబ్లికన్‌ సభ్యుల మొండి వైఖరితో ఈ బిల్లుల ఆమోదం ప్రతినిధుల(దిగువ)సభలో అసాధ్యమని తేలిపోయిన పరిస్థితుల్లో స్పీకర్‌ మెకార్థీ చూపిన ప్రత్యేక చొరవ ఫలించింది. అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి ఎదురైన షట్‌డౌన్‌ ముప్పు.. చివరి నిమిషంలో తాత్కాలికంగా తొలగిపోయింది.

45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఇబ్బందిలేకుండా చేసే స్వల్పకాల బిల్లులకు విపక్ష రిపబ్లికన్ల ఆధిక్యం ఉన్న ప్రతినిధుల సభలో శనివారం మధ్యాహ్నం ఆమోదం లభించింది. విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉక్రెయిన్‌కు నిధుల పద్దుకు సంబంధించిన అంశాన్ని ఇందులో చేర్చలేదు. శనివారం రాత్రి 12 గంటల్లోపు ఈ బిల్లులు పాసైతేనే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం.. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే అక్టోబరు 1 నుంచి తమ సిబ్బందికి వేతనాలను, వివిధ ప్రభుత్వ విభాగాలకు, పథకాలకు నిధులను అందించగలుగుతుంది.

మొత్తం 12 ద్రవ్య వినిమయ బిల్లులకు ఆమోదం లభించడం లేదు. అధికార పక్షమైన డెమోక్రాట్లకు దిగువ సభలో అధిక్యత లేకపోవడం, విపక్ష రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ ఉండటమే ఇందుకు కారణం. వీటిలో ఉక్రెయిన్‌కు నిధులు అందజేసే బిల్లు కూడా ఉంది. ఉక్రెయిన్‌ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని రిపబ్లికన్​ పార్టీ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇతర బిల్లుల్లో 30శాతం వ్యయం తగ్గించడానికి డెమోక్రాట్లు సిద్ధమైనా.. విపక్ష రిపబ్లికన్లు మాత్రం అందుకూ అంగీకరించలేదు. దిగువ సభ స్పీకర్‌ మెకార్థీ విపక్ష రిపబ్లికన్‌ పార్టీకే చెందినప్పటికీ.. అమెరికా దేశ ప్రజలకు కలిగే ఇబ్బందులు నివారించేందుకు బిల్లులను ఆమోదించాలని సభ్యులను కోరారు.

జో బైడెన్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలనే పట్టుదలతో ఉన్న రిపబ్లికన్‌ పార్టీలోని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు.. ఎట్టకేలకు ఓ మెట్టు దిగి వచ్చి స్పీకర్‌ ప్రతిపాదించిన స్వల్పకాల బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ సభలో మొత్తం 435 మందికి గాను ప్రస్తుతం 433 మంది సభ్యులున్నారు. వీరిలో 221 మంది రిపబ్లికన్‌ పార్టీకి, 212 మంది డెమోక్రటిక్​ పార్టీకి చెందిన వారు ఉన్నారు. స్వల్ప కాల బిల్లును 335 మంది సభ్యుల మద్దతు లభించగా 91 మంది వ్యతిరేకించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023) పద్దుల్లో చూపిన స్థాయిలోనే రానున్న 45 రోజులకు సరిపడే నిధుల మంజూరుకు అమెరికా చట్ట సభల నుంచి అమోదం లభించింది. అధ్యక్షుడు బైడెన్‌ కోరిన విధంగా విపత్తు సహాయ నిధికి 16 బిలియన్‌ డాలర్ల మేర అధికంగా నిధులు మంజూరు చేయడానికి సభ్యులు ఒప్పుకున్నారు.

బైడెన్​ ఆమోదం..
ప్రతినిధుల​ సభ పాస్​ చేసిన స్వల్పకాల బిల్లులకు అధ్యక్షుడు జోబైడెన్​ ఆమోదం ముద్ర వేశారు. దీంతో అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి ఎదురైన షట్‌డౌన్‌ ముప్పు తప్పింది.

Trump Biden Polls : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ X బైడెన్​.. 10 పాయింట్ల తేడాతో ఆయనే ముందంజ!

Trump Dhoni : ధోనీకి ట్రంప్ స్పెషల్​ ఇన్విటేషన్​.. గోల్ఫ్​ ఆడేందుకు పిలిచి..

Last Updated : Oct 1, 2023, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.