ETV Bharat / international

అమెరికాలో భీకర కాల్పులు.. సబ్​వే రక్తసిక్తం! - అమెరికా వార్తలు

US Shooting: న్యూయార్క్​ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. బ్రూక్లిన్​లో రైలు ప్రయాణించే ఓ సబ్​వేలో కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సబ్​వే అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు.

US Shooting
అమెరికాలో కాల్పులు
author img

By

Published : Apr 12, 2022, 7:43 PM IST

Updated : Apr 13, 2022, 11:03 AM IST

Subway Shooting: అమెరికాలో గన్​ కల్చర్ మరోసారి తెరపైకి వచ్చింది. న్యూయార్క్​ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. బ్రూక్లిన్​లో రైలు ప్రయాణించే ఓ సబ్​వేలో కాల్పులు జరిపారు దుండగులు. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సబ్​వే అంతా రక్తసిక్తమైందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. ముసుగు ధరించిన వ్యక్తులు ఘటనాస్థలం నుంచి పారిపోయినట్లు వెల్లడించారు.

సబ్​వేలో పొగలు కమ్ముకోగా.. పోలీసులు రంగంలోకి దిగారు. కాల్పుల కారణంగానే పొగలు వెలువడ్డాయని స్పష్టం చేశారు. కాల్పులతో నగరంలో రైలు ప్రయాణాలు ఆలస్యంగా మొదలయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. సబ్​వేలో యాక్టివ్​ పేలుడు పదార్థాలను గుర్తించలేదని వెల్లడించారు. ఈ ఘటనతో సంబంధం ఉండొచ్చని భావిస్తోన్న వ్యక్తిని న్యూయార్క్‌ పోలీసులు గుర్తించారు. అతడి ఫొటోను విడుదల చేశారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి 50వేల డాలర్ల నజరాన ప్రకటించారు. 62 ఏళ్ల ఫ్రాంక్‌ ఆర్‌ జేమ్స్‌ను ఈ కేసులో 'పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌'గా ప్రకటించారు. ఈ వ్యక్తి ఆరెంజ్‌ కలర్‌ కోటు ధరించి ఉన్నాడని పేర్కొన్నారు. అతడు వాడినట్లు భావించిన యూ హౌల్‌ వ్యాన్‌ తాళాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.

US Shooting
'పర్సన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌'గా ప్రభుత్వం పేర్కొంటున్న 62 ఏళ్ల ఫ్రాంక్​ ఆర్​ జేమ్స్

రైల్వేస్టేషన్‌లో దాడి చేసిన వ్యక్తి సబ్‌వేకార్‌లో పొగబాంబులు విసరడానికి ముందు గ్యాస్‌ మాస్క్‌ ధరించాడు. అనంతరం కాల్పులు ప్రారంభించినట్లు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఈ ఘటనలో 10 మందికి బుల్లెట్‌ గాయాలు కాగా.. మరో 13 మంది తొక్కిసలాటలో గాయపడ్డారు. నిందితుడు ప్రజలపై కాల్పులు జరిపేందుకు వాడిన గ్లాక్‌ హ్యాండ్‌గన్‌ను స్వాధీనం చేసుకొన్నారు. దీంతోపాటు రెండు పేలని స్మోక్‌ గ్రనేడ్లు, మూడు తుపాకీ మ్యాగ్జైన్లు గుర్తించారు. ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందించారు. కాల్పుల్లో గాయపడిన వారికి వెంటనే సాయం చేసిన తోటి ప్రయాణికులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలో తుపాకుల నియంత్రణకు జోబైడెన్‌ సర్కారు కొత్త నిబంధనలు విధించిన ఒక్క రోజు తర్వాత ఈ కాల్పులు చోటు చేసుకోవడం గమనార్హం. అమెరికాలో తుపాకీ కాల్పుల్లో ఏటా 40,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

ఇదీ చదవండి: అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి కాల్పులు.. ఎనిమిది మంది మృతి

Last Updated : Apr 13, 2022, 11:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.