ETV Bharat / international

'భారత్​ దౌత్య విజయం'.. మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించిన ఐరాస - మక్కీ లష్కరే తోయిబా ఉగ్రవాది

లష్కరే తోయిబా ఉగ్ర సంస్థ డిప్యూటీ చీఫ్​​ అబ్దుల్​ రెహ్మాన్​ మక్కీకి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఐరాస భద్రత మండలిలో భారత్​, అమెరికా చేసిన సంయుక్త ప్రతిపాదన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

UNSC Sanctions Committee MAKKI global terrorist

author img

By

Published : Jan 17, 2023, 11:59 AM IST

పాకిస్థాన్‌ ఉగ్రవాద సం‌స్థ లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ అబ్దుల్‌ రెహ్మాన్‌ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది ఐక్యరాజ్యసమితి. భద్రతా మండలికి చెందిన అల్‌ఖైదా ఆంక్షల కమిటీ మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. ఈ నిర్ణయంతో మక్కీ ఆ‌స్తులను జప్తు చేయటం, ఆయన ప్రయాణంపై ఆంక్షలు, నిషేదం, ఆయుధ ఆంక్షలు అమలు కానున్నాయి. గత సంవత్సరం భారత్‌, అమెరికా ఉమ్మడి ప్రతిపాదనను చైనా చివరి నిమిషంలో ఉపసంహరించుకుంది. తాజాగా ఐక్యరాజ్యసమితి ఆంక్షల కమిటీ తన వ్యక్తిగత, సంస్థల ఆంక్షల జాబితా లోకి మక్కీని చేర్చింది. కాగా మక్కీ.. 26/11 ముంబై ఘటన సూత్రధారి హఫీజ్‌ సయీద్‌కు స్వయాన బావ కావడం కీలకాంశంగా మారింది.

మక్కీని అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తిస్తూ.. అతడు నిధులు సేకరించడం, ఉగ్రవాదుల నియామకాలు, యువతను హింసకు పురిగొల్పుతున్నాడని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ఇండియాలో దాడులకు ప్రయత్నించాడని ఐరాస భద్రతా మండలికి ఆంక్షల కమిటీ ఆంక్షలకు కారణాలుగా చెప్పింది. మక్కీ ఎల్​ఈటీలో ఉండగా 2000లో ఎర్రకోటపై దాడులు జరిగాయని చెప్పింది. 26/11 ముంబయి దాడులను 'భారత్​లో లష్కరే తోయిబా చేసిన అత్యంత దారుణమైన దాడి'గా అభివర్ణించింది. 2018లో శ్రీనగర్, ఖాన్​పొరా, బారాముళ్ల, గురెజ్​లో ఎల్​ఈటీ చేసిన దాడులను ప్రస్తావించింది. కాగా, మక్కీపై ఆంక్షలు ఇండియా దౌత్య విజయమని భారత మాజీ దౌత్యవేత్తలు అభివర్ణించారు.

"మొదటి సారి భద్రతా మండలిలో భారత్​ ప్రతిపాదించిన అంశం అప్రూవ్​ అయింది. ఐరాస ప్రత్యేకంగా జమ్ముకశ్మీర్​లో పాకిస్థాన్​ జరిపిన ఉగ్రదాడుల గురించి పేర్కొంది. భద్రతా మండలిలో భారత్ సభ్య దేశంగా, ఐరాస కౌంటర్​ టెర్రరిజం కమిటీ ఛైర్మన్​గా ఉండటం వల్ల ఉగ్రవాదం, సీమాంతర ఉగ్రవాదంపై ప్రపంచం దృష్టి పెరిగింది".

-- భారత ఐరాస శాస్వత ప్రతినిధి

చివర్లో అడ్డుపడిన చైనా..
2022, జూన్ 1​న మక్కీని యూఎన్‌ఎస్‌సీలోని ఐఎస్‌ఐఎల్‌, అల్ ఖైదా ఆంక్షల కమిటీ కింద 'గ్లోబల్ టెర్రరిస్ట్' జాబితాలో చేర్చాలని భారత్‌, అమెరికా సంయుక్తంగా ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనను 'నో ఆబ్జక్షన్‌ విధానం' కింద కమిటీలోని 15 సభ్యదేశాలకు పంపారు. జూన్‌ 16 వరకు గడువు ఇచ్చారు. ఈ క్రమంలోనే చివర్లో చైనా ఈ ప్రతిపాదనను టెక్నికల్‌ హోల్డ్‌లో ఉంచింది. భద్రతా మండలి విధి విధానాల ప్రకారం.. దీన్ని ఆరు నెలల వరకు కొనసాగించవచ్చు. ఈ ప్రతిపాదనకు చైనా చివర్లో అడ్డుపడింది.

గతంలోనూ జైషే మహ్మద్​ చీఫ్ మసూద్ అజర్‌ను ఈ జాబితాలో చేర్చేందుకు భారత్‌ ప్రతిపాదించగా.. చైనా ఇదే విధంగా కనీసం నాలుగు సార్లు అడ్డుకుంది. అజర్ కార్యకలాపాలపై మరింత సమాచారం అవసరమైనందున ఆ మేరకు స్పందించినట్లు వాదించింది. చివరకు, అంతర్జాతీయ సమాజం ఒత్తిడితో 2019లో వెనక్కు తగ్గింది. కాగా, 2019 మే 15న పాకిస్థాన్ ప్రభుత్వం మక్కీని లాహోర్​లో​ గృహ నిర్బంధంలో ఉంచింది. 2020లో పాక్​ కోర్టు మక్కీని దోషిగా తేలుస్తూ జైలు శిక్ష విధించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.