ETV Bharat / international

కీవ్​లో 900 మంది పౌరుల మృతదేహాలు.. రోజు గుట్టలుగుట్టలుగా..

Ukraine News: ఉక్రెయిన్​తో రష్యాకు యుద్ధం నేపథ్యంలో పలువురు పౌరులు ప్రాణాలు కొల్పోతున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలో 900 మందికి పైగా సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. కీవ్​లో శవాలు గుట్టగుట్టలుగా ఉన్నాయని పేర్కొన్నారు.

Ukraine News
ఉక్రెయిన్​ సంక్షోభం
author img

By

Published : Apr 15, 2022, 10:49 PM IST

Updated : Apr 16, 2022, 6:43 AM IST

Ukraine News: ఉక్రెయిన్​-రష్యా యుద్ధంలో సాధారణ పౌరులు ప్రాణాలు కొల్పోతున్నారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్​లో 900 మంది మృతదేహాలు లభ్యమయ్యాయని పోలీసులు శుక్రవారం తెలిపారు. కీవ్​ నుంచి రష్యా బలగాల ఉపసంహరణ తరువాత ఈ మృతదేహాలు కనిపించాయని అన్నారు. 95 శాతం మంది పౌరులు తుపాకితో కాల్చిన గాయాలతో మరణించినట్లు అధికారులు వెల్లడించారు. రోజు రోజుకీ శవాలు గుట్టలు గుట్టలుగా బయటపడుతున్నాయని తెలిపారు. బాధితుల్లో ఎక్కువమంది బుచా ప్రాంతానికి చెందినవారని వెల్లడించారు. సుమారు 350 మంది ఈ ప్రాంత వాసులే మరణించారని తెలిపారు.

మరోవైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మళ్లీ పెరుగుతున్నాయి. గురవారం నల్ల సముద్రంలో రష్యా యుద్ధనౌక ఒకటి తీవ్రంగా దెబ్బతింది. దానిపైకి రెండు క్షిపణులను గురిపెట్టి తామే దెబ్బ తీసినట్లు ఉక్రెయిన్‌ ప్రకటించింది. దానిని రష్యా తోసిపుచ్చింది. లోపల ఉన్న పేలుడు పదార్థాలు పొరపాటున పేలి 'మాస్క్‌వా' అనే ఈ నౌక దెబ్బతిందని వివరణ ఇచ్చింది. తమపై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. కీవ్​పై క్షిపణులతో విరుచుకుపడతామని చెప్పింది.

ఇదీ చదవండి: 'కీవ్​పై క్షిపణుల వర్షం'.. ఉక్రెయిన్​కు రష్యా వార్నింగ్

Last Updated : Apr 16, 2022, 6:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.