ETV Bharat / international

'చెర్నోబిల్'​లో అధిక రేడియేషన్.. రష్యా బలగాల వల్లే..

author img

By

Published : Apr 27, 2022, 4:52 AM IST

Ukraine Chernobyl plant: ఉక్రెయిన్​లోని చెర్నోబిల్ ప్లాంట్​ను రష్యా కొన్ని రోజులు క్రితం స్వాధీనం చేసుకుంది. అప్పటి నుంచి రష్యా బలగాలు భారీ పరికరాలను ఇక్కడకు తరలిస్తూ.. మళ్లీ తీసుకువెళ్లే సమయంలో రేడియేషన్‌ స్థాయిలు మరింత పెరుగుతుండడం గమనించామని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(IAEA) తెలిపింది. ఇలానే రేడియేషన్ స్థాయి ఉంటే అత్యంత ప్రమాదకరంగా మారే అవకాశముందని హెచ్చరించింది.

Chernobyl
చెర్నోబిల్‌

Ukraine Chernobyl plant: ఉక్రెయిన్‌లో భీకర దాడులకు తెగబడుతోన్న రష్యా సేనలు అక్కడి చెర్నోబిల్‌ ప్లాంట్‌ను తమ ఆధీనంలోకి తీసుకుంది. అయితే.. అప్పటి నుంచి సైనిక బలగాల కదలికలతో అక్కడ భారీ స్థాయిలో రేడియేషన్‌ విడుదల అవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా అది అసాధారణ స్థాయికి చేరుకొని అత్యంత ప్రమాదకరంగా మారిందని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) హెచ్చరించింది.

'చెర్నోబిల్‌లో రేడియేషన్‌ స్థాయిలో అసాధారణంగా ఉన్నాయి. రష్యా బలగాలు భారీ పరికరాలను ఇక్కడకు తరలిస్తూ.. మళ్లీ తీసుకువెళ్లే సమయంలో రేడియేషన్‌ స్థాయిలు మరింత పెరుగుతుండడం గమనించాం. నిత్యం వీటి పరిస్థితులను అంచనా వేస్తూనే ఉన్నాం. ప్రస్తుతం ఇవి అత్యంత ప్రమాదకరంగా మారాయి' అని చెర్నోబిల్‌ ప్లాంటు సందర్శన అనంతరం ఐఏఈఏ డైరెక్టర్‌ రాఫేల్‌ గ్రోస్సీ వెల్లడించారు. అయితే, న్యూక్లియర్‌ ప్లాంట్‌ చుట్టూ ఉన్న డెడ్‌ జోన్‌ లోపలికి రష్యా బలగాలు ట్యాంక్‌లతో వెళ్లడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తినట్లు అనుమానిస్తున్నారు.

ఇదిలాఉంటే, 1986లో చెర్నోబిల్‌ అణువిద్యుత్‌ కేంద్రం విషాదం యావత్‌ ప్రపంచాన్ని కలచివేసింది. ఆ కేంద్రం నుంచి వెలువడిన రేడియోధార్మికత వల్ల వేల మంది ప్రజలు మృత్యువాతపడ్డారు. అటువంటి నిషేధిత ప్రాంతాన్ని రష్యా సేనలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అయితే, భారీ స్థాయిలో సైనిక కదలికల వల్ల అక్కడి అణువ్యర్థాల నుంచి వచ్చే రేడియేషన్‌ క్రమంగా పెరుగుతోంది. మొన్నటివరకు పరిమిత స్థాయిలోనే ఉన్నప్పటికీ ఇటీవల అవి ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్లు అంతర్జాతీయ నిపుణులు వెల్లడిస్తున్నారు.

ఇదీ చదవండి: జర్మనీపై ప్రతీకారం తీర్చుకున్న రష్యా.. 40మందిని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.