ETV Bharat / international

అవిశ్వాస పరీక్షలో గట్టెక్కిన బ్రిటన్ ప్రధాని - boris Johnson confidence vote

Boris Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. 211 మంది సొంత పార్టీ నేతల మద్దతుతో గండం గట్టెక్కారు. అయితే ఓటింగ్ రోజు హైడ్రామా నడిచింది. పార్టీ గేట్ వ్యవహారంలో ఆరోపణలు వచ్చినప్పటికీ తనపై నమ్మకం ఉంచాలని, అనుకూలంగా ఓటు వేయాలని సొంత పార్టీ నేతలను బోరిస్ వేడుకున్నారు.

Boris Johnson
అవిశ్వాస పరీక్షలో గట్టెక్కిన బ్రిటన్ ప్రధాని
author img

By

Published : Jun 7, 2022, 2:12 AM IST

Updated : Jun 7, 2022, 6:45 AM IST

UK PM Johnson: బ్రిటన్ ప్రధాని బోరిస్​ జాన్సన్​ అవిశ్వాస పరీక్షలో నెగ్గారు. సోమవారం జరిగిన ఓటింగ్​లో మెజరిటీ కన్జర్వేటివ్​ పార్టీ నేతలు ఆయనకు మద్దతుగా నిలిచారు. 211 ఓట్లు అనుకూలంగా రావడం వల్ల అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఒక్క ఓటు తేడాతో అయినా బోరిడ్ ఓడిపోతారని భావించిన ప్రతిపక్షాలకు నిరాశే మిగిలింది. అయితే ఓటింగ్ రోజు హైడ్రామా నడిచింది. పార్టీ గేట్ వ్యవహారంలో ఆరోపణలు వచ్చినప్పటికీ తనపై నమ్మకం ఉంచాలని, అనుకూలంగా ఓటు వేయాలని సొంత పార్టీ నేతలను బోరిస్ వేడుకున్నారు.

Boris Johnson confidence vote: సీక్రెట్​ బ్యాలెట్​ ద్వారా నిర్వహించిన ఓటింగ్​లో విశ్వాస పరీక్షలో నెగ్గాలంటే బోరిస్​కు 180 మంది సొంత పార్టీ నేతల మద్దతు అవసరం కాగా.. 211 ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన ఊపిరిపీల్చుకున్నారు. ప్రతినిధుల సభలో మొత్తం సభ్యుల సంఖ్య 650 కాగా, అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి 359 మంది బలం ఉంది. అయితే బోరిస్‌ను పదవి నుంచి తప్పించడానికి సొంత పార్టీలో 180 మంది సభ్యుల బలం అవసరం. కానీ బోరిస్​కు అనుకూలంగా 211 ఓట్లు వచ్చాయి. అవిశ్వాసంలో జాన్సన్‌ విజయం సాధించినందు వల్ల కన్జర్వేటివ్‌ పార్టీ నిబంధనల ప్రకారం మరో ఏడాది పాటు ఆయనపై అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి వీల్లేదు.

కొవిడ్‌ ఉద్ధృతంగా ఉన్న సమయంలో తన అధికారిక నివాసంలో విందు ఇచ్చిన వ్యవహారంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. సొంత పార్టీ కన్జర్వేటివ్ సభ్యుల నుంచే ఈ విశ్వాస పరీక్ష ఎదుర్కొన్నారు. 2020 జూన్‌లో జరిగిన ఈ విందును పార్టీగేట్‌ కుంభకోణంగా పేర్కొంటున్నారు. పార్టీగేట్‌ కుంభకోణంపై కన్జర్వేటివ్‌ పార్టీ ఏర్పాటు చేసిన న్యూ గ్రే కమిషన్‌.. బోరిస్‌పై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్టీగేట్‌ వ్యవహారానికి సీనియర్‌ నాయకత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. దీనిపై పార్లమెంటు వేదికగా బోరిస్‌ క్షమాపణలు చెప్పినా ఆయనపై విమర్శలు మాత్రం ఆగలేదు. సొంత పార్టీకి చెందిన 40 మంది సభ్యులు బోరిస్‌ రాజీనామాకు డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే తాజా పరిణామం చోటు చేసుకుంది.

ఇదీ చదవండి: 'అలా చేస్తేనే ట్విట్టర్ డీల్.. లేదంటే క్యాన్సిల్'.. మస్క్​ బెదిరింపు!

Last Updated : Jun 7, 2022, 6:45 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.