ETV Bharat / international

సునాక్ ప్రభుత్వానికి షాక్​.. ఉపఎన్నికల్లో ఓటమి.. 2025లో గట్టిపోటీ తప్పదా? - boris johnson resignation reason

UK By Elections Results : బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు భారీ షాక్‌ తగిలింది. తాజాగా మూడు స్థానాలకు జరిగిన ఉపఎన్నికల్లో రిషి సునాక్​ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ రెండు స్థానాల్లో ఓటమిపాలైంది. ఈ ఉప ఎన్నికల ఫలితాలు రిషి సునాక్‌ నాయకత్వంపై ఒత్తిడిని పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు.

uk by elections 2023
uk by elections 2023
author img

By

Published : Jul 21, 2023, 1:41 PM IST

UK By Elections Results : బ్రిటన్‌లో రిషి సునాక్‌ నాయకత్వంలోని అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బ్రిటన్​లో మొత్తం 3 పార్లమెంట్​ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల కన్జర్వేటివ్ పార్టీ ఓటమి చవిచూసింది. ఉత్తర ఇంగ్లాండ్‌లోని సెల్బే-అయిన్‌స్టీ సీటులో లేబర్‌ పార్టీ విజయం సాధించింది. గతంలో ఇక్కడ కన్జర్వేటివ్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలిచింది. ఇక మరో స్థానమైన సోమర్టన్‌-ఫ్రోమ్‌ను లిబరల్‌ డెమోక్రటిక్‌ పార్టీ గెలుచుకొంది. ఇక కన్జర్వేటివ్ పార్టీ ఉక్స్‌బ్రిడ్జ్‌-సౌత్‌ రూయిస్లిప్‌ సీటును మాత్రం దక్కించుకొంది. గతంలో ఇది బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ గెలిచిన స్థానం. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నిక నిర్వహించారు. ఇక్కడ కన్జర్వేటివ్​ పార్టీ గతంలో కంటే బలపడింది.

British By Election Results : ఈ ఉప ఎన్నికల ఫలితాలు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ నాయకత్వంపై ఒత్తిడిని గణనీయంగా పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఓటములతో వచ్చే జనరల్‌ ఎలక్షన్స్‌ అధికార కన్జర్వేటివ్‌ పార్టీకి పెనుసవాల్​గా మారనున్నాయని అంటున్నారు. బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్‌ అధికారం చేపట్టిన తొమ్మిది నెలల్లో పార్టీ నాయకులు పలు వివాదాలు, కుంభకోణాల్లో చిక్కుకున్నారు. దీనికి తోడు ఆర్థిక వ్యవస్థపై ద్రవ్యోల్బణం ఒత్తిడి వంటివి పార్టీ పాపులారిటీని మరింత తీవ్రంగా దెబ్బతీశాయి.

ఉప ఎన్నిక ఫలితాలను చూసిన విశ్లేషకులు వచ్చే జనరల్‌ ఎలక్షన్స్‌లో కెయిర్‌ స్టార్మర్‌ నాయకత్వంలోని లేబర్‌ పార్టీ నుంచి అధికార పక్షానికి గట్టిపోటీ తప్పదని చెబుతున్నారు. 2025లో బ్రిటన్‌లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శీతాకాలంలో ఓటర్లు పోలింగ్‌కు పెద్దగా మొగ్గు చూపని విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ముందుగానే ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

బ్రిటన్‌లో దాదాపు 65శాతం మంది ఓటర్లు ఆ దేశ ప్రధాని రిషి సునాక్‌కు ప్రతికూలంగా ఉండగా.. 25శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నట్లు ఇటీవల ఓ సర్వే పేర్కొంది. 'యూ గవ్‌ పోల్‌' పేరిట నిర్వహించిన సర్వేలో దాదాపు 2,151 మంది బ్రిటన్‌ వాసుల అభిప్రాయాలను సేకరించారు. రిషి సునాక్​పై ఉన్న సానుకూల దృక్పథం దాదాపు 40శాతం తగ్గిందని సర్వే తెలిపింది. ఇక గత నెలతో పోల్చుకొంటే 6 శాతం తగ్గిందని వెల్లడించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.