ETV Bharat / international

12 మంది భార్యలు, 102 మంది పిల్లలు.. ఇక చాలట.. ఎందుకంటే? - Uganda latest news

ఒక్క పెళ్లి చేసుకుని, ఒకరిద్దరు పిల్లల్ని పెంచేందుకే తిప్పలు పడుతున్నారు చాలా మంది! అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా 12 మందిని వివాహం చేసుకుని 102 మంది పిల్లలను కనేశాడు. చివరకు ఇక చాలు.. పిల్లలు వద్దని అంటున్నాడు. ఇంతకీ అతడు ఎవరు? అంత మందిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఓసారి అతడి కథేంటో తెలుసుకుందాం రండి.

ముసా హసహ్య ఫ్యామిలీ
ముసా హసహ్య ఫ్యామిలీ
author img

By

Published : Feb 2, 2023, 4:21 PM IST

ప్రస్తుత రోజుల్లో ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంటే.. ఆ వ్యక్తి మాత్రం ఏకంగా 12 మందిని పెళ్లి చేసుకుని 102 మంది పిల్లలను కనేశాడు. ఇంకా పెళ్లిళ్లు చేసుకుని.. మరికొంతమంది పిల్లలను కనాలనే ఆశ అతడిలో ఇంకా సజీవంగానే ఉంది! కానీ, పరిస్థితులు అతడిని ఓ కఠిన నిర్ణయం తీసుకొనేలా చేశాయి. దీంతో అతడు పెళ్లి, పిల్లలు అనే ఆలోచనను అటకెక్కించాడు. ప్రస్తుతం ఉన్నవారిని పోషించలేక ఇబ్బందుల్లో పడ్డాడు.

అది సరే, అంతమందిని కనేసిన ఆ పెద్దమనిషి ఎవరు అనేగా మీ సందేహం. ఆయన్ను మీరు చూడాలంటే ఉగాండా వెళ్లాలి. బుటలజా జిల్లాలోని బుగిసా అనే గ్రామంలో నివసిస్తున్న అతడి పేరు ముసా హసహ్య. అయితే, మీరు ఆ ఊరిలోకి వెళ్లి ఇతడి పేరు చెబితే చాలు.. నేరుగా ఇంటికి తీసుకెళ్లిపోతారు. ఎందుకంటే.. ఆ గ్రామంలో మనోడు అంత ఫేమస్ మరి! ఒక వేళ అతడి పేరు మీరు మరిచిపోయినా.. 12 మందిని పెళ్లి చేసుకున్న వ్యక్తి అని చెప్పినా చాలట.

ఇద్దరు భార్యలు వదిలేశారు.. మరో ముగ్గురు పక్క ఊర్లో..
12 మందిని పెళ్లి చేసుకున్న ముసా హసహ్యకు రెండు ఎకరాల భూమి మాత్రమే ఉంది. అందులో పంటలు పండిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దీంతో అందరికీ ఆహారం, దుస్తులు వంటివి సమాకూర్చలేకపోతున్నాడు. అందుకే ఇటీవలే ఇద్దరు భార్యలు అతడిని విడిపెట్టి వెళ్లిపోయారు. మరో ముగ్గురు భార్యలు పక్క ఊర్లో ఉంటున్నారు.

అందుకే అంత మంది పిల్లలను కన్నాడట
"మా తల్లిదండ్రులకు ఇద్దరే పిల్లలు. కాబట్టి మా కుటుంబ వారసత్వాన్ని విస్తరించేందుకు అంతమంది భార్యలను పెళ్లి చేసుకున్నాను. 102 మంది పిల్లలకు తండ్రి అయ్యాను. వంశాన్ని విస్తరించాలంటే అనేక మంది మహిళలను పెళ్లి చేసుకోవాలని మా సోదరుడు, బంధువులు, స్నేహితులు నాకు సలహా ఇచ్చారు. అందుకే నా మొదటి భార్యను 1972లో సంప్రదాయ రీతిలో పెళ్లి చేసుకున్నాను. అప్పటికి నా వయసు 17 ఏళ్లు. పెళ్లైన సంవత్సరానికి మొదటి బిడ్డ సాండ్రా నాబ్వైర్​ జన్మించింది. ప్రస్తుతం నా భార్యలు గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారు" అని హసహ్య చెప్పాడు.

హసహ్యకు తన పిల్లల పేర్లు గుర్తులేవట..
హసహ్య 102 మంది పిల్లల వయసు 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య ఉంటుందట. అతడి చిన్న భార్య వయసు 35 ఏళ్లట. అయితే పెద్ద సవాలు ఏమిటంటే హసహ్యకు తన చాలా మంది పిల్లల పేర్లు గుర్తులేవట. పిల్లలను గుర్తించడంలో వారి తల్లుల సహాయం తీసుకుంటాడట. అంతే కాకుండా హసహ్య తన కుటుంబంలో తలెత్తే వివాదాలను పరిష్కరించుకోవడానికి నెలకోసారి కుటుంబ సమావేశాలను కూడా నిర్వహిస్తున్నాడట.

ముసా హసహ్య ఫ్యామిలీ
ముసా హసహ్య ఫ్యామిలీ

కొన్నిసార్లు ఆహారం కూడా సరిపోవట్లేదట!
హసహ్య కుటుంబానికి చెందిన చాలా మంది సభ్యులు తమ పొరుగువారి ఇళ్లలో పనులు చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే కాలినడకనే ప్రయాణిస్తున్నారు. అంతే కాకుండా రోజూ వరుస క్రమంలో కూర్చుని భోజనం చేస్తుంటారు. అయితే కొన్ని సార్లు ఆహారం సరిపోదని, ఆ సమయంలో రోజుకు రెండు సార్లే తింటామని హసహ్య మూడో భార్య జబీనా చెప్పింది. ఏదేమైనా తన కుటుంబమంతా తనను ప్రేమిస్తున్నట్లు హసహ్య చెబుతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.