ETV Bharat / international

శిథిలాల కిందే కుళ్లిపోతున్న శవాలు.. 35వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య

author img

By

Published : Feb 14, 2023, 6:53 AM IST

భూకంప సహాయక చర్యలపై తుర్కియే ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అధ్యక్షుడు ఎర్డోగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. భారీ భూకంపంతో అయినవాళ్లను, తమ నివాసాలను కోల్పోయిన తుర్కియే ప్రజలు.. సహాయక బృందాల కొరతతో తమ కుటుంబ సభ్యుల శవాలు శిథిలాల కిందే కుళ్లిపోతున్నాయని వాపోతున్నారు.

turkey-earthquake-public-anger-on-president
టర్కీ అధ్యక్షుడిపై ప్రజల ఆగ్రహం

భారీ భూకంపంతో అయినవాళ్లను, తమ నివాసాలను కోల్పోయిన తుర్కియే ప్రజలు అధ్యక్షుడు ఎర్డోగన్‌ నేతృత్వంలోని ప్రభుత్వ తీరుపై విరుచుకుపడుతున్నారు. వారి నిర్వేదం ఆగ్రహంగా మారే ప్రమాదముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 'ఎర్డోగన్‌.. మీ తల్లి ఈ పరిస్థితుల్లో ఉంటే ఏం చేస్తావ్‌? ప్రపంచనాయకుడా ఏమయింది? ఎక్కడున్నావ్‌' అని అరుస్తూ తన తల్లిని కోల్పోయిన ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ కనిపించాడు. సహాయక బృందాల కొరతతో తమ కుటుంబ సభ్యుల శవాలు శిథిలాల కిందే కుళ్లిపోతున్నాయని అడియామన్‌లోని ఓ మహిళ వాపోయారు. అన్‌టాకియాలోని 1000 మంది నివసించే 12 అంతస్తుల భవనం కూలిపోగా వాటి శిథిలాల తొలగింపు పనులు ఇప్పటికీ కొలిక్కి రాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

.

సోమవారం ఓ బాలుడు సహా ఇద్దరు మహిళలను సిబ్బంది రక్షించారు. విపత్తు వచ్చి వారం రోజులు పూర్తవడంతో ఎవరైనా శిథిలాల నుంచి సజీవంగా బయటకు వచ్చే అవకాశాలు అతి స్వల్పమని అధికారులు తెలిపారు. తుర్కియా, సిరియాల్లో భూకంప మృతుల సంఖ్య సోమవారానికి 35 వేలు దాటింది. ఆ మృతదేహాలను ఖననం చేయడానికి ఎక్కడికక్కడ కొత్త శ్మశానాలు ఏర్పాటవుతూనే ఉన్నాయి. మరోవైపు వేల ఇళ్లు నేలమట్టం కావడంతో తమకు నివాసం లేకుండా పోయిందని బాధితులు నిరాశలో కూరుకుపోయారు. తాత్కాలిక శిబిరాల్లో సామర్థ్యానికి మించి నిరాశ్రయులు ఉంటున్నారు. ప్రభుత్వం చెప్పినట్లు మరో నగరానికి వెళ్లి బతకడం తన లాంటి పేదవాడికి కుదరదని పోలట్‌ అనే గ్రామంలోని రైతు వాపోయారు. సిరియా నుంచి వచ్చిన కాందిశీకులు తమకు అందాల్సిన సాయాన్ని, ఆహారాన్ని దోచుకుంటున్నారని తుర్కియేలోని భూకంప బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి వ్యవస్థకు వారు భారంగా మారారంటూ ఆక్రోశిస్తున్నారు హతాయీలో సిరియన్‌ వలసదారులకు సాయం చేస్తున్న భద్రతా సిబ్బందిపై తుర్కియే ప్రజలు దాడులకు సిద్ధపడటంతో ఆస్ట్రేలియా, జర్మనీ సహాయక సిబ్బంది తమ సేవలను కొన్ని గంటల పాటు నిలిపివేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.